బన్నీ వున్నాడే..మహా దేశ ముదురు..తక్కువోడు కాదు. పోయి పోయి, ఓ మహిళా ఎమ్మెల్యేకు లైన్ వేసాడు. మరి ఇంకేముంది..ఆమె చుట్టూ గోడకట్టి, ఆమెతో పనులు చేయించుకుంటూ పబ్బం గడుపుతున్నవారు ఊరుకుంటారా? ఛేజ్ లు, ఫైట్లు..ఇలా ఎన్ని సీన్లు వుంటాయి..మరెన్ని అల్లుకొవచ్చు..అదే జరుగుతోంది ఇప్పుడు..బోయపాటి డైరక్షన్ లో అల్లు అర్జున్ నటేంచే సినిమాలో.
బన్నీ కోసం బోయపాటి ఈ వైవిధ్యమైన లైన్ తయారు చేసాడని విశ్వసనీయ వర్గాల బోగట్టా. లేడీ ఎమ్మెల్యేకు, బన్నీ లాంటి కుర్రాడు లైన్ వేయడం అంటే మరి వైవిధ్యం కాక ఇంకేమిటి? ఈ సినిమా సూపర్ గా వచ్చిందని, బన్నీ ఎనర్జీకి సరిపడా పవర్ ప్యాక్డ్ సీన్లు పడ్డాయని తెలుస్తోంది.
నిజానికి లేడీ ఎమ్మెల్యేకు కుర్రాడు లైన్ వేయడం అన్న సింగిల్ పాయింట్ విని బన్నీ, అరవింద్ ఓకె చేసేసారని వినికిడి. ఆ తరువాత దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. క్లయిమాక్స్ లాక్ చేయడానికి మాత్రం కాస్త బాగానే టైమ్ పట్టింది. చివరకు ఓకె అయింది.