అయోమయంలో నాని బాబు

టన్నుల కొద్దీ టాలెంట్‌ ఉన్నా కానీ ఈమధ్య లక్‌ కలిసిరాక డల్‌ అయిపోయిన హీరో నాని ఈ ఏడాది మొదట్లో తగిలిన జంట దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదు. ఒకే నెలలో విడుదలైన పైసా,…

టన్నుల కొద్దీ టాలెంట్‌ ఉన్నా కానీ ఈమధ్య లక్‌ కలిసిరాక డల్‌ అయిపోయిన హీరో నాని ఈ ఏడాది మొదట్లో తగిలిన జంట దెబ్బల నుంచి ఇంకా కోలుకోలేదు. ఒకే నెలలో విడుదలైన పైసా, ఆహా కళ్యాణం పరాజయాలు నానిని డిఫెన్స్‌లోకి నెట్టాయి. అంతకుముందు వరుసపెట్టి సినిమాలు సైన్‌ చేసిన నాని ఇప్పుడు ఏం చేస్తే ఏమవుతుందో అనే అయోమయంలో పడ్డాడు. 

పూర్తయినా విడుదల కాకుండా ఆగిపోయి ఉన్న ‘జెండాపై కపిరాజు’ రిలీజ్‌ అయితే నానికి కాస్త ఊరటగా ఉండి, క్లారిటీ వచ్చి ఉండేది. అదేమో విడుదల కావడానికి నానా పాట్లు పడుతూ నెలల తరబడి బాక్సుల్లో మగ్గిపోతోంది. నానితో చేయడానికి పలువురు దర్శకులు, నిర్మాతలు రెడీగా ఉన్నా కానీ అతను మాత్రం తన తదుపరి చిత్రం గురించి ఫైనల్‌ కాల్‌ తీసుకోలేకపోతున్నాడు. 

మారుతి డైరెక్షన్‌లో ఒక సినిమా ఉంటుందని, అశ్వనీదత్‌కి చెందిన స్వప్న సినిమా బ్యానర్‌పై ఓ చిత్రం చేయబోతున్నాడని, ఓ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడని చాలా వార్తలు వినిపిస్తున్నాయి కానీ వీటిలో ఏదీ ఇంకా సెట్స్‌ మీదకి వెళ్లలేదు. త్వరగా తన కన్‌ఫ్యూజన్‌ వీడి నాని పనిలో పడితే బెటరేమో. అసలే తన జోన్‌లో ఇప్పుడు పోటీ బాగా ఎక్కువైపోయింది.