సినిమా విడుదలై మొదటి ఆట పడేవరకు హీరో దగ్గర నుంచి నిర్మాత వరకు పిచ్చ కాన్ఫిడెన్స్ తో వుంటారు. వుండాలి..లేకుంటే సినిమా విడుదల కామడమే కష్టం అవుతుంది. ఈ వారం వస్తున్న ముకుంద, చినదాన నీ కోసం సినిమాల వ్యవహారం ఇలాగే వున్నాయి. ఇన్నాళ్లు గ్రహాలన్నీ తమ దారిన తాము మిగిలిన వారికి టచ్ కాకుండా వ్యవహరిస్తున్నట్లు, తెలుగు సినిమాలన్నీ చాలా జాగ్రత్తగా ఒక్కోవారం ఎంచుకుని జనం ముందుకు వస్తున్నాయి.
అయితే లింగా తెచ్చిన తంటాకు జడిసి చినదాన నీ కోసం ఓ వారం వెనక్కు జరిగింది. గోపాల గోపాల తో ఇంటిపోరు ఎందుకని, ముకుంద ఏకంగా మూడు వారాలు ముందే వచ్చేసింది. దీంతో రెండు ఢీ కొనక తప్పడం లేదు.. అప్పటికీ ఆనవాయితీగా ఎంచుకునే శుక్రవారాన్ని వదిలి ముకుంద రెండు రోజులు ముందే వస్తోంది.
రెండు సినిమాల మీద ఇటు జనాలకు కూడా మంచి హోప్ వుంది. చినదాన నీకోసం డైరక్టర్ కరుణాకరన్, ముకుంద డైరక్టర్ శ్రీకాంత్ కు ఎవరి లిమిటేషన్లు వారికి వున్నాయి. కరుణాకరన్ అంతా ఏసి డీసీ వ్యవహారం. గ్యారంటీ హిట్ అని చెప్పలేం..అలా అని బాగుండదని అనలేం. చిన్న స్టార్స్ తో మాంచి హిట్ కొట్టిన డైరక్టర్ అతనే…రామ్ కు భయంకరమైన ఫ్లాప్ ఇచ్చిందీ అతనే. కానీ యూత్ పల్స్ ను భలేగా పట్టుకోగలడు. విజువల్ గా బాగా తీయగలడదు. మరి వాటిపైనే చినదాని ఆశలు వున్నాయి.
ఇక శ్రీకాంత్ క్లాస్ డైరక్టర్. ఫీల్ గుడ్ సినిమాలే తీసాడు..అయితే ఫన్ బాగా పండుతుంది అతని సినిమాల్లో. ట్రాక్ రికార్డు చూస్తే అలాగే వుంది. కానీ మెగాఫ్యాన్స్ కు అది ఒక్కటే చాలదు. మాంచి ఫైట్లు వుండాలి. మాస్ మజా వుండాలి. అది తొలిసారి అటెంప్ట్ చేస్తున్నాడు అతను. అందులో ఏమేరకు సక్సెస్ అవుతాడన్నది బట్టి సినిమా విజయం ఆధారపడి వుటుంది.
టాలీవుడ్ కు ఈ ఏడాది ఆఖరు రోజుల్లో రెండూ హిట్ అయితే అంతకన్నా ఆనందం ఇంకొకటి వుండదు.