ముని సిరీస్ తో తెలుగు, తమిళ నాటన సంచలనాలు నమోదు చేస్తున్నాడు లారెన్స్. ఇప్పుడు ముని, కాంచన, గంగ తరువాత నాలుగో భాగం తమిళంలో నాగ పేరుతో రెడీ అవుతోంది ఇప్పుడు ఈ భాగం తెలుగులో కూడా విడుదల చేయడానికి అన్నీ రెడీ అయిపోయాయి. తెలుగులో భైరవ అన్న పేరు ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
Advertisement
అయితే లారెన్స్ సినిమా హక్కులకు భారీ రేటు చెబుతున్నట్లు తెలుస్తోంది. గంగ సినిమా తెలుగు హక్కులు 16 కోట్ల మేరకు విక్రయించాడు. అది అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు నాలుగో భాగానికి ఇరవైకి పైగానే అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తానికి ఓ నిర్మాత సై అన్నట్లు. ఓకె అయినట్లు తెలిసింది.