అన్నీ రెడీ..ఈరోస్ ఫండింగ్ రెడీ. ఇద్దరు హీరోయిన్లు రెడీ.. శ్రీవాసు, కోన వెంకట్ అండ్ కో బ్యాచ్ రెడీ. కానీ డిక్టేటర్ ఇంకా ప్రారంభం కావడం లేదు. బాలయ్య రాజకీయంగా బిజీ బిజీగా వున్నారు. ఇటీవల ప్రజలతో దర్బార్లు కూడా నిర్వహించారు. మరోపక్ కోన వెంకట్ తన సినిమా శంకరాభరణం తో బిజీ.
క్లాప్ అయితే కొట్టేసారు కానీ డిక్టేటర్ ఎప్పుడు ప్రారంభం అంటే ఈ నెలాఖర్లో అంటూ వార్తలే వినిపిస్తున్నాయి తప్ప పక్కా డేట్ వినిపించడం లేదు. బాలయ్య బాబు ఖాళీ కావాలి..అప్పుడు ప్రారంభం కావాలి. మరోపక్క బాలయ్యకు చెప్పిన స్క్రిప్ట్..తీసే స్క్రిప్ట్ అంతా పక్కాగా వుండాలని, కోన వెంకట్ అండ్ కో ముందు రంగంలోకి దిగిపోయి, అలా అలా చేసుకుంటూ వెళ్లడం అలవాటని, ఈ రెండింటికి సింక్రనైజ్ కాకనే జాప్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
బాలయ్య దగ్గర వ్యవహారాలు చాలా స్ట్రిక్టు. అందుకని ఇప్పుడు అస్సలు మార్చకుండా వుండే, ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవుతోందని, అది బాలయ్య బాబు ఒకె చేసాక సెట్స్ పైకి వెళ్తారని టాక్.