హీరోయిన్లు అంతే..

సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్లు సినిమాలు చేస్తున్నామా లేదా అనే కానీ, సినిమా కథేంటీ..తదితర విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. అవన్నీ హీరో చూసుకుంటాడు. అయితే కొందరు హీరొయిన్లు మంచి పాత్రల కోసం చూస్తారు. …

సాధారణంగా టాలీవుడ్ లో హీరోయిన్లు సినిమాలు చేస్తున్నామా లేదా అనే కానీ, సినిమా కథేంటీ..తదితర విషయాల్లో పెద్దగా జోక్యం చేసుకోరు. అవన్నీ హీరో చూసుకుంటాడు. అయితే కొందరు హీరొయిన్లు మంచి పాత్రల కోసం చూస్తారు. 

అలా చూసి,చేసి సహజనటి అనిపించుకుంది జయసుధ. ఇప్పుడు ఆమె కొడుకు తెరంగ్రేటం చేసాడు. మరి అలాంటపుడు ఆ సినిమా కథేంటీ? కథనమేంటి? అసలు సినిమా ఎలా వచ్చింది? ఇలాంటివి ఆమె చూసుకోవాలి కదా? అసలే కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న సినిమానాయె. 

అంత అనుభవం వున్న జయసుధ ఈ సినిమా ముందుగా చూసి వున్నా, స్క్రిప్ట్ ను పరిశీలించి వున్నా ఓకె అనకపోనేమో? ఎందకుంటే ఈ సినిమా ఏ మాత్రం తన కొడుకుకు ఉపయోగపడదని అర్థం అయి వుండేది? సగటు హీరోయిన్ల మాదిరిగా సినిమా వచ్చిందా..చేసామా?అన్నట్లుగానే వదిలేసినట్లు కనిపిస్తోంది.