Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

పచ్చగా ఉన్న చోట నిప్పు రాజేస్తే...

పచ్చగా ఉన్న చోట నిప్పు రాజేస్తే...

పాపాలు చేయని వాడు భూప్రపంచంలో ఉండడు. మనిషి జనమ ఎత్తినాక కొన్ని అలా జరుగుతూనే ఉంటాయి. చాలా మంది తాము పాపం  చేశాం అని గుర్తిస్తుంటారు. గుర్తించిన వాళ్లలో సగం మంది దాన్ని కడుక్కోడానికి ప్రయత్నిస్తారు. దిద్దుకోవాలని చూస్తారు. మిగిలిన సగంలో చాలా మంది ... గుర్తించినా కూడా.. తాము గుర్తంచలేదన్నట్లుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు.

ఇక మిగిలిపోయిన కొంత మంది ఉంటారు. వారు కూడా తమ పాపాన్ని గుర్తిస్తారు. వీరు అందరికంటె మేధావులు. తమ పాపాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని కూడా వీరు గుర్తిస్తారు. అప్పడిక తమ పాపాన్ని సమర్థించుకోవడం ప్రారంభిస్తారు. అది అసలు పాపమే కాదు పొమ్మని మిగిలిన ప్రపంచం మొత్తాన్నీ నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.

అలాంటి బాపతుకు చెందిన రాజకీయ నాయకుడు జైరామ్ రమేశ్.

తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ  లు పైకి తమలో తాము తగాదా పడుతున్నట్లుగా జనాల ముందు బిల్డప్ లు ఇచ్చుకుంటూ.. ఏదో కిందా మీద  పడి రోజులు నెట్టేస్తున్నారు. అలాంటి వారి బంధంలో నిప్పులు పోయడానికి జైరామ్ రమేశ్ తగుదునమ్మా అంటూ ఆంధ్రప్రదేశ్ టూర్ వేసినట్లుగా కనిపిస్తోంది. నాల్రోజుల ముందు తిరుపతి, ఇవాళ విజయవాడలో ఆయన ఇదే పనిచేస్తున్నారు.

ఏదో ఒక రకంగా ఈ రెండు పార్టీలు ద్రోహం చేస్తున్నాయని ప్రచారం చేయగలిగితే.. తమ పార్టీకి లాభం ఉంటుందని ఆయన కలగంటున్నట్లుగా ఉంది. కానీ జైరామ్ ఒక సంగతి గుర్తంచుకోవాలి.

భాజపా, తెదేపా ఇద్దరూ మోసం చేస్తున్నారని గుర్తించినంత మాత్రాన ఏపీ ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకుంటారని అనుకుంటే భ్రమ. కాంగ్రెస్ చిత్తశుద్ధిని డైరక్టుగా నిరూపించుకుంటే తప్ప వారికి మళ్లీ పుట్టగతులు ఉండవు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?