Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie News

సమ్మర్ సీజన్ మిస్సయిన కల్కి

సమ్మర్ సీజన్ మిస్సయిన కల్కి

ఎన్నికల మూలంగా కల్కి సినిమా వాయిదా అనివార్యమైంది. మరి కొత్త విడుదల తేదీ ఎప్పుడు? దీనిపై కొన్ని రోజులుగా చాలా స్పెక్యులేషన్ నడిచింది. కొంతమంది ఎన్నికలైన కొద్ది రోజులకే సినిమా విడుదలవుతుందని భావించారు. మరికొంతమంది మే నెలాఖరుకు వస్తుందన్నారు. ఇప్పుడీ సస్పెన్స్ కు తెరపడింది.

కల్కి సినిమా విడుదలకు కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయింది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీని జూన్ 27న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అదిరిపోయే పోస్టర్ తో రిలీజ్ డేట్ ఇచ్చారు.

జూన్ 27 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. కొత్త ప్రభుత్వం కూడా కొలువుదీరే అవకాశం ఉంది. టికెట్ రేట్ల పెంపు లాంటి ప్రత్యేక పర్మిషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. పైగా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి పోటీ లేదు. సో.. తేదీ మంచిదే. కాకపోతే 2 అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి.

వీటిలో ముఖ్యమైంది అశ్వనీదత్ సెంటిమెంట్. మే 9వ తేదీ అశ్వనీదత్ కు సెంటిమెంట్. జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఆ తేదీని అతడు వదులుకోవాల్సి వచ్చింది.

ఇక ఇబ్బంది పెడుతున్న రెండో అంశం వేసవి శెలవులు. జూన్ 27 అంటే దాదాపు సమ్మర్ హాలిడేస్ ముగిసినట్టే. స్టూడెంట్స్ అంతా కాలేజీలు, స్కూళ్లకు వెళ్లడంతో బిజీగా ఉంటారు. సో.. తల్లిదండ్రులు కూడా బిజీ. ఇలా శెలవులు ముగిసిన తర్వాత థియేటర్లలోకి రావడం సినిమాకు కాస్త ఇబ్బందికరమే.

అయితే దర్శకుడు నాగ్ అశ్విన్ ఇవి పట్టించుకోవడం లేదు. తన శక్తి మేరకు ది బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే పనిలో ఉన్నాడు. సినిమా కంటెంట్ బాగుంటే సీజన్ తో సంబంధం లేదనేది ఇతడి వాదన.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?