Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'తెలుగు తల్లి'ని ఇప్పటికయినా గుర్తిస్తారా.?

'తెలుగు తల్లి'ని ఇప్పటికయినా గుర్తిస్తారా.?

'భరత మాత ముద్దు బిడ్డ..' అన్న మాట ప్రతి భారతీయుడిలోనూ ఉత్సాహాన్ని నింపుతుంది. అదొక భావన మాత్రమే. తెలుగు తల్లి కూడా అంతే. ఆ మాటకొస్తే, గోదావరిని 'గోదారమ్మ' అంటాం, కృష్ణా నదిని కృష్ణమ్మ అంటాం. అది ఒక భావన. భారతీయులుగా మనకి గుర్తింపునిచ్చేంది భరతమాత అయితే, మన జీవన ప్రయానంలో అత్యంత కీలకమైన పాత్రని నదులు పోషిస్తాయి కాబట్టి, వాటినీ అమ్మలుగా భావిస్తాం. 'తెలుగు తల్లి' అయినా అంతే.! 

కానీ, తెలంగాణ ఉద్యమంలో తెలుగు తల్లికి చాలా అవమానాలు జరిగాయి. 'తెలుగు తల్లి.. ఎవడికి తల్లి.?' అంటూ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కొందరు తెలంగాణ ఉద్యమకారులు ఎగతాళి చేశారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకేసి, 'తెలంగాణ తల్లి'ని తెరపైకి తెచ్చారనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడిక, అసలు విషయానికొస్తే తెలంగాణలో 'ప్రపంచ తెలుగు మహా సభలకు' రంగం సిద్ధమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించేస్తోంది. ఈ టైమ్‌లోనే, 'తెలుగు తల్లి' అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. 'మా తెలుగు తల్లి' అనే పాట విషయమై కొందరు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. 

'రెండు రాష్ట్రాలుగా వేరుపడ్డాం.. ఇకనైనా తెలుగు తల్లికి సముచితమైన గౌరవాన్ని ఇవ్వండి.. తద్వారా మన జాతిని మనం గౌరవించుకున్నట్లవుతుంది..' అన్నది వారి అభ్యర్థన. తెలుగు తల్లి అంటే.. తెలుగు భాష.. తెలుగు నేల. రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు ప్రజలంతా కలిసిమెలిసే వున్నప్పుడు, 'మేం తెలుగుతల్లి బిడ్డలం' అని చెప్పుకోవడం తప్పెలా అవుతుంది.? తెలంగాణ యాసకి పట్టం కట్టడాన్ని తప్పు పట్టలేం. రాజకీయ ఆలోచనలతో పుట్టినా, తెలంగాణ తల్లి.. తెలంగాణ ఆత్మగౌరవమే. మరి, తెలుగు తల్లి విషయంలో ఎందుకీ చిన్న చూపు.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?