రంగస్థలం ఎఫెక్ట్ తో ఛల్ మోహన్ రంగకు ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. ఇటు నైజాంలో మాత్రం తన పలుకబడి ఉపయోగించి దాదాపు 170స్క్రీన్లు సంపాదించగలిగాడు నిర్మాత సుధాకర్ రెడ్డి. అలా డీసెంట్ గా రిలీజైన ఛల్ మోహన్ రంగ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 4కోట్ల రూపాయల షేర్ సంపాదించింది.
కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, నితిన్ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అ..ఆ సినిమా రెండో స్థానంలో నిలిచింది ఛల్ మోహన్ రంగ. ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి 2కోట్ల 83లక్షల షేర్ వస్తే.. అందులో కోటి రూపాయలకు పైగా వాటా నైజాందే.
ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.06 కోట్లు
సీడెడ్ – రూ. 0.40 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.18 కోట్లు
వెస్ట్ – రూ. 0.20 కోట్లు
గుంటూరు – రూ. 0.24 కోట్లు
కృష్ణా – రూ. 0.23 కోట్లు
నెల్లూరు – రూ. 0.11 కోట్లు
మొదటి రోజు మొత్తం షేర్ – రూ. 2.83 కోట్లు