మరీ పోటీపడేంత పెద్ద స్థాయి సినిమాలేవీ లేవు ఈ నెలలో. వచ్చేవన్నీ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలే. కానీ అవే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. స్టార్ కాస్ట్ తో కాదు… స్టోరీలైన్ తో.
జులై ఫస్ట్ వీక్ లో నిన్ను కోరి, కురుక్షేత్రం, మామ్, స్పైడర్ మేన్ హోం కమింగ్ లాంటి సినిమాలొస్తున్నాయి. వీటిలో నాని నటించిన నిన్నుకోరి సినిమాపైనే అందరి దృష్టి ఉంది. మాస్, స్పైడర్ మేన్ డబ్బింగ్ సినిమాలు.
ఇక జులై రెండోవారంలో శమంతకమణి, దండుపాళ్యం-2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. శమంతకమణి సినిమా ఇప్పటికే ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది. నారా రోహిత్, ఆది, సందీప్ కిషన్, సుధీర్ బాబు.. ఇలా నలుగురు యంగ్ హీరోస్ కలిసి చేసిన సినిమా కావడంతో ఈ మూవీపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.
ఈనెల మూడో వారానికి ఫిదా సినిమా ఒక్కటే ప్రస్తుతానికి డేట్ లాక్ చేసుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. అంచనాల సంగతి పక్కనపెడితే, అటు శేఖర్ కమ్ముల ఇటు వరుణ్ తేజ్ ఇద్దరికీ ఈ సినిమా విజయం చాలా అవసరం.
గోపీచంద్ నటించిన గౌతమ్ నంద, సునీల్ ఉంగరాల రాంబాబు, సుకుమార్ నిర్మించిన దర్శకుడు, కృష్ణవంశీ తెరకెక్కించిన నక్షత్రం, నారా రోహిత్-నాగశౌర్య మరోసారి కలిసి చేసిన కథలో రాజకుమారి సినిమాలు కూడా ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. సో ఈ నెల సందడంతా యంగ్ హీరోలదే అని చెప్పాలి.