50 రోజుల్లో రూ.126 కోట్లు

రీసెంట్ గా 50రోజులు పూర్తిచేసుకుంది రంగస్థలం సినిమా. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ 50రోజుల్లో రంగస్థలం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 125కోట్ల 99లక్షల రూపాయల వసూళ్లు…

రీసెంట్ గా 50రోజులు పూర్తిచేసుకుంది రంగస్థలం సినిమా. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ 50రోజుల్లో రంగస్థలం సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 125కోట్ల 99లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 93కోట్ల 67లక్షల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఈ 50రోజుల్లో విడుదలైన చాలా కేంద్రాల్లో రంగస్థలం సినిమా నాన్-బాహుబలి రికార్డులు సృష్టించినట్టు ప్రకటించారు. అటు ఓవర్సీస్ లో 2కోట్ల 55లక్షల రూపాయల ఓవర్ ఫ్లోస్ కూడా వచ్చినట్టు తెలిపిన నిర్మాతలు.. నైజాంలో అత్యథికంగా 28కోట్ల 55లక్షల రూపాయలు వచ్చాయని, ఈస్ట్, గుంటూరు ప్రాంతాల్లో 7కోట్ల మార్క్ క్రాస్ చేసిందని తెలిపారు.

ఏపీ, నైజాం 50రోజుల షేర్

నైజాం – రూ. 28.55 కోట్లు
సీడెడ్ – రూ. 18.57 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 13.52 కోట్లు
ఈస్ట్ – రూ. 8.04 కోట్లు
వెస్ట్ – రూ. 7.74 కోట్లు
గుంటూరు – రూ. 8.60 కోట్లు
కృష్ణా – రూ. 7 కోట్లు
నెల్లూరు – రూ. 3.49 కోట్లు