ఇండియన్ క్రికెట్ సుప్రిమోగా సౌరవ్ గంగూలీ!

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కీలకమైన పదవి లభించనుందని తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీఐ)కి అధ్యక్షహోదా గంగూలీకి లభించడం లాంఛనమే అని తెలుస్తోంది. బీసీసీఐ ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవంగా జరగనున్నట్టుగా…

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కీలకమైన పదవి లభించనుందని తెలుస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీఐ)కి అధ్యక్షహోదా గంగూలీకి లభించడం లాంఛనమే అని తెలుస్తోంది. బీసీసీఐ ఎన్నికలు పూర్తిగా ఏకగ్రీవంగా జరగనున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా గంగూలీకి ఏకంగా బీసీసీఐ ప్రెసిడెంట్ యోగం ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.

బహుశా బీసీసీఐ ఏర్పడ్డాకా, అది ఇంత భారీ ఆర్థిక శక్తిగా మారాకా.. దానికి ఒక మాజీ కెప్టెన్ ప్రెసిడెంట్ కావడం జరగలేదేమో. అలాంటి హోదా ఇప్పుడు దాదాకు దక్కుతుండటం గమనార్హం. సౌరవ్ వంటి విజయవంతమైన కెప్టెన్ బీసీసీఐకి అధ్యక్షుడు కావడం అన్ని వర్గాల్లోనూ ఆమోదయోగ్యమైనదే.

క్రికెట్ పాలన అనేది ఇన్నేళ్లూ రాజకీయ నేతల చేతుల్లో ఉంటూ వచ్చింది. లాబీయిస్టులు, రాజకీయ నేతలు బీసీసీఐని శాసిస్తూ వచ్చారు. ఇప్పుడు  ఒక క్రికెటర్, విజయవంతమైన ఆటగాడు కమ్ కెప్టెన్ బీసీసీఐకి అధ్యక్షుడు అయితే అది ఆహ్వానించదగిన అంశమే.

అయితే ఇప్పుడు  కూడా చాలామంది రాజకీయ నేతలు బోర్డులో భాగస్వామ్యులు కానున్నారని తెలుస్తోంది. అమిత్ షా తనయుడు కూడా బీసీసీఐలో కీలక పదవిని పొందనున్నారట. అలాగే బీసీసీఐ అధ్యక్షుడు  అనురాగ్ ఠాకూర్ సంబంధీకులు కూడా బోర్డులో మళ్లీ పాగా వేయనున్నారని తెలుస్తోంది.  కొన్నాళ్లు బీసీసీఐ పూర్తిగా కోర్డు ఆదేశాల మేరకు నడుస్తూ వస్తోంది.

బీసీసీఐలో సంస్కరణలను తీసుకురావడం కోసం  ఆ సంస్థకు పాలకమండలిని కోర్టే ఏర్పాటు చేసింది. ఇప్పుడు దేశంలోని అన్ని క్రికెట్ బోర్డుల సభ్యుల ఓట్లతో బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికలు జరగడానికి కూడా కోర్టే ఆదేశాలు ఇచ్చింది. ఓటింగ్ అవసరం లేకుండా.. అన్ని ఏకగ్రీవ నియామకాలకు అనుగుణంగా వాళ్లంతా మాట్లాడేసి, ఒప్పందాలకు వచ్చారని సమాచారం.

జ్ఞానం రాత్రికి రాత్రి రాదు.. విద్యార్జన నిరంతర ప్రక్రియ