ఇండియన్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా తండ్రి అయ్యాడు. అతడి గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిచ్ బాబుకు జన్మనిచ్చింది. తనకు బాబు పుట్టిన విషయాన్ని హార్దిక్ పాండ్యా అఫీషియల్ గా ఇనస్టాగ్రామ్ లో వెల్లడించాడు. బాబు చేయి, తన చేయి కలిసిన ఫొటోను కూడా పోస్ట్ చేశాడు.
హార్దిక్, నటాషా ఇంకా పెళ్లి చేసుకోలేదు. తామిద్దరం ఎంగేజ్ మెంట్ చేసుకున్నామని, జనవరి 1న ఎంగేజ్ మెంట్ అయిందని ప్రకటించింది ఈ జంట. అది జరిగిన కొన్ని నెలలకే తను తండ్రిని కాబోతున్నట్టు ప్రకటించాడు పాండ్యా.
హార్దిక్ పాండ్యా, నటాషా గతేడాది నుంచి సహజీవనం చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, డాన్సర్ గా నటాషాకు మంచి ఇమేజ్ ఉంది. ఇద్దరూ గతేడాది ప్రారంభంలో కలుసుకున్నారు. అభిప్రాయాలు కలవడంతో డేటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఏడాది జనవరిలో దుబాయ్ లో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు.
అయితే తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని పాండ్యా ఇంకా ప్రకటించలేదు. నడుము గాయం కారణంగా కొంతకాలంగా ఇండియన్ టీమ్ కు దూరంగా ఉన్న పాండ్యా.. ఈ ఏడాది చివర్లో యూఏఈలో జరగనున్న ఐపీఎల్ తో మళ్లీ గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు.