ఐ ల‌వ్ కొహ్లీ… హి ఈజ్ లైక్ మార‌డొనా…

ఈ మాట విన‌గానే ఓహో బాలీవుడ్ న‌టి అనుష్కశ‌ర్మ అనుంటుందిలే అని ఊరుకుంటే అల‌వాటులో పొర‌పాట‌న్నట్టే. ఈ సారి ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీని ఇంత‌గా అభిమానించిన వ్యక్తి నిన్నటి ఎన‌ర్జిటిక్ క్రికెట‌ర్…

ఈ మాట విన‌గానే ఓహో బాలీవుడ్ న‌టి అనుష్కశ‌ర్మ అనుంటుందిలే అని ఊరుకుంటే అల‌వాటులో పొర‌పాట‌న్నట్టే. ఈ సారి ఇండియ‌న్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కొహ్లీని ఇంత‌గా అభిమానించిన వ్యక్తి నిన్నటి ఎన‌ర్జిటిక్ క్రికెట‌ర్ సౌర‌వ్ గంగూలీ. శ్రీలంక‌లో టెస్ట్ సంద‌ర్భంగా గురువారం కొహ్లీ సెంచురీ చేసిన ద‌రిమిలా.. గంగూలీ ఆనందం  ప‌ట్టలేక కొహ్లీని ప్రశంస‌ల‌తో ముంచెత్తాడు. 

త‌న‌కు ఫుట్‌బాల్ ఆట‌గాడు డిగోమార‌డోనా అంటే ఎంతో ఇష్టమ‌ని, అత‌నెప్పుడు ఆడినా ఆట ప‌ట్ల అత‌ని ఇష్టం గుండెల్లో నుంచి వ‌చ్చిన‌ట్టు అనిపిస్తుంద‌ని మ‌ళ్లీ అలాంటి పేష‌న్‌ను తాను కొహ్లీలో చూశానన్నాడు. తానిప్పుడు కొహ్లీకి అభిమానిని అయిపోయాన‌ని కూడా చెప్పాడు. కేవ‌లం మైదానంలో ఆట‌లోనే కాదు వెలుప‌ల అత‌ని లైఫ్‌స్టైల్ కూడా త‌న‌కు ఎంతో న‌చ్చుతుందన్నాడు. అత‌ను ఆడుతున్నప్పుడు చూస్తుంటే త‌న‌లో కాన్ఫిడెన్స్ రెట్టింపు అవుతుంద‌న్నాడు. 

అత‌నిలో గెలుపు ఆక‌లి ఉంద‌ని, అది ఆట‌గాడికి చాలా అవ‌స‌ర‌మంటున్న గంగూలీ… కెప్టెన్‌గా కొహ్లీ ఇప్పటికే 4 సెంచురీలు చేసిన సంగ‌తిని గుర్తు చేస్తూ అది అత‌నిలోని నిల‌క‌డ‌గా రాణించే త‌త్వంకు నిద‌ర్శన‌మ‌న్నాడు. దీనితో పాటే… ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ ప‌రంగా కొహ్లీ చేసిన మార్పుల్ని కూడా గంగూలీ అభినందించాడు. మొత్తానికి అనుష్కతో ఫ్రెండ్‌షిప్ కార‌ణంగా త‌ర‌చుగా ఇబ్బందులు, కొన్ని విమ‌ర్శలు సైతం ఎదుర్కుంటున్న కొహ్లీకి మొన్నటి కెప్టెన్ గంగూలీ అందించిన పొగ‌డ్తలు కొంత ఉప‌శ‌మ‌న‌మే…