డ‌బుల్ సెంచ‌రీనే కాదు.. ఫాస్టెట్ డ‌బుల్ సెంచ‌రీ!

వ‌న్డే క్రికెట్ లో ద‌శాబ్దాల పాటు మ‌హామ‌హా బ్యాట్స్ మ‌న్ల‌కు కూడా సాధ్యం కాని ఫీట్ డ‌బుల్ సెంచ‌రీ. వ‌న్డేల్లో తొలి ద్విశ‌త‌కం అద్భుతం అనేంత స్థాయిలో నిలిచింది ద‌శాబ్దాల పాటు. ఎప్పుడో 1983లోనే…

వ‌న్డే క్రికెట్ లో ద‌శాబ్దాల పాటు మ‌హామ‌హా బ్యాట్స్ మ‌న్ల‌కు కూడా సాధ్యం కాని ఫీట్ డ‌బుల్ సెంచ‌రీ. వ‌న్డేల్లో తొలి ద్విశ‌త‌కం అద్భుతం అనేంత స్థాయిలో నిలిచింది ద‌శాబ్దాల పాటు. ఎప్పుడో 1983లోనే క‌పిల్ దేవ్ 175 ప‌రుగుల‌తో వ్య‌క్తిగ‌త అత్య‌ధిక స్కోరును సాధించాడు. అదే చాలా కాలం పాటు హ‌య్యెస్ట్ స్కోర్ గా నిలిచింది. ఆ త‌ర్వాత ఆ ద‌రిదాపులు, అంత‌కు మించిన స్కోర్ల‌ను చాలా మంది సాధించారు కానీ డ‌బుల్ సెంచ‌రీ మాత్రం అంద‌ని ద్రాక్ష‌గానే నిలిచింది. 

సౌర‌వ్ గంగూలీ 183 ప‌రుగులు, సచిన్ టెండూల్క‌ర్ 185, స‌యీద్ అన్వ‌ర్ 194 ప‌రుగులు.. ఇలాంటి వ్య‌క్తిగ‌త స్కోర్లు చాలా సంవ‌త్స‌రాల పాటు టాప్ మోస్ట్ లో నిలిచాయి. అస‌లు వ‌న్డేల్లో 200 ప‌రుగులు సాధ్య‌మేనా? అనే చ‌ర్చ ద‌శాబ్దాల పాటు సాగింది. టెస్టుల్లో త్రిబుల్ సెంచ‌రీలు, లారా అయితే నాలుగు వంద‌ల ప‌రుగులు కూడా సాధించాడు. అయితే డ‌బుల్ మాత్రం ద‌శాబ్దాల పాటు క‌ల‌గానే మిగిలిపోయింది.

టీ20లు వ‌చ్చాకా బ్యాట్స్ మెన్ల ఆటిట్యూడ్ మారిపోయింది. ఇర‌వై ఓవ‌ర్ల‌లోపే సెంచ‌రీలు సాధ్య‌మ‌య్యాయి. అయినా వ‌న్డేల వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి డ‌బుల్ అంటే.. అంత తేలిక కాలేదు. చివ‌ర‌కు 2010లో స‌చిన్ టెండూల్క‌ర్ వ‌న్డేల్లో డ‌బుల్ సాధించాడు. సౌతాఫ్రికాతో జ‌రిగిన ఆ మ్యాచ్ లో వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో తొలి సారి ఒక బ్యాట్స్ మ‌న్ డ‌బుల్ సెంచ‌రీ సాధించ‌డం అనే అద్భుతం జ‌రిగింది.

ఆ తర్వాత ఒక్కొక్క‌రుగా డ‌బుల్ సెంచ‌రీల‌ను సాధించ‌డం మొద‌లైంది. స‌చిన్ త‌ర్వాత సెహ్వాగ్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ఇంకా న్యూజిలాండ్ క్రికెట‌ర్ గ‌ప్టిల్, ఆ పై రోహిత్ శ‌ర్మ అయితే మూడు సార్లు డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు వ‌న్డేల్లో. ఇంకా ఈ జాబితాలో ఒక్కొక్క‌రుగా ఎక్కుతూ ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌న్డేల్లో ఎనిమిది సార్లు డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు కాగా, తాజాగా తొమ్మిదో డ‌బుల్ సెంచ‌రీ సాధన జ‌రిగింది.

బంగ్లాదేశ్ లో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ లో భార‌త బ్యాట్స్ మ‌న్ ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ సాధించాడు. ఇప్ప‌ట్లో వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ అంటే మ‌రీ అంత అద్భుతం కాక‌పోవ‌చ్చు! కానీ ఇషాన్ కిష‌న్ అత్యంత వేగంగా డ‌బుల్ సెంచ‌రీ సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 2015 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో విండీస్ ప్లేయ‌ర్ క్రిస్ గేల్ న్యూజిలాండ్ పై 138 ప‌రుగుల్లో డ‌బుల్ సెంచ‌రీ చేశాడు. ఇప్పుడు ఇషాన్ కిష‌న్ 126 బంతుల్లోనే డ‌బుల్ పూర్తి చేశాడు. త‌ద్వారా అత్యంత వేగంగా రెండు వంద‌ల ప‌రుగులు సాధించ‌ని బ్యాట్స్ మ‌న్ అనే ఖ్యాతిని సంపాదించుకున్నాడు. సెంచ‌రీని చేయ‌డానికి 85 బంతులు ఆడిన ఇషాన్, ఆ త‌ర్వాత 41 బంతుల్లోనే మ‌రో వంద ప‌రుగులు పూర్తి చేశాడు. ఇక ఇదే మ్యాచ్ లో దాదాపు 1200 రోజుల త‌ర్వాత వ‌న్డేల్లో సెంచ‌రీ చేశాడు విరాట్ కొహ్లీ. ఈ సెంచ‌రీతో అత్య‌ధిక సెంచ‌రీల విష‌యంలో రెండో స్థానానికి చేరుకున్నాడు. రికీపాంటింగ్ రికార్డును అధిగ‌మించి, స‌చిన్ త‌ర్వాతి స్థానంలో నిలుస్తున్నాడు విరాట్.