ప్చ్‌.. దురదృష్టం వెంటాడింది.!

దురదృష్టం ఇంతలా వెంటాడుతుందా.? అని అంతా షాక్‌కి గురయ్యారు. చెన్నయ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీకి చేరువైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కెఎల్‌ రాహుల్‌, తృటిలో డబుల్‌ సెంచరీని మిస్సయ్యాడు. టీమిండియా…

దురదృష్టం ఇంతలా వెంటాడుతుందా.? అని అంతా షాక్‌కి గురయ్యారు. చెన్నయ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీకి చేరువైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కెఎల్‌ రాహుల్‌, తృటిలో డబుల్‌ సెంచరీని మిస్సయ్యాడు. టీమిండియా జట్టులోకి మెరుపులా దూసుకొచ్చిన ఈ యంగ్‌స్టర్‌, జూనియర్‌ రాహుల్‌ ద్రావిడ్‌ అనే పేరు తెచ్చుకున్న విషయం విదితమే. ఒకే ఒక్క పరుగు.. వెరీ వెరీ స్పెషల్‌ ఇన్నింగ్స్‌ అనే డ్రీమ్‌ని చెడగొట్టేసింది. 

నెర్వస్‌ నైన్‌టీస్‌ చాలామందిని ఇలాగే ఇబ్బంది పెడ్తుంది. ఇక్కడే, ఆటగాడి సత్తా ఏంటో తేలిపోతుంది. ఎవరైతే ఆ నెర్వస్‌నెస్‌ నుంచి బయటపడ్తారో వాళ్ళే నిజమైన ఆటగాళ్ళు. అఫ్‌కోర్స్‌, ఎంతటి టాలెంట్‌ వున్న ఆటగాడైనాసరే, చిన్ని చిన్ని తప్పిదాలు చేయడం సహజమే. ఆ చిన్న తప్పిదమే చేశాడు రాహుల్‌.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. డబుల్‌ సెంచరీ చేజారిపోయింది. 

199 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద కెఎల్‌ రాహుల్‌ డబుల్‌ సెంచరీని చేజార్చుకోవడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సైతం షాక్‌కి గురయ్యాడు. విరాట్‌ కోహ్లీ ఏంటి, మొత్తం టీమిండియా షాక్‌కి గురయ్యింది. అప్పటిదాకా అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన రాహుల్‌, ఇలాంటి చెత్త షాట్‌ ఎందుకు కొట్టాను.? అనుకుంటూ కాస్సేపు బ్లాంక్‌ అయిపోయాడు. 

ఇక, టీమిండియా – ఇంగ్లాండ్‌కి ధీటుగా బదులివ్వడంతో చెన్నయ్‌ టెస్ట్‌ డ్రా అయ్యేలా కన్పిస్తోంది. పిచ్‌ బ్యాట్స్‌మెన్‌కి సహకరిస్తుండడంతో, చెన్నయ్‌లో ఫలితం తేలే అవకాశాలు తక్కువే. పరుగుల పరంగా టీమిండియా ఇంకా వెనకబడే వున్నా, మూడు రోజుల ఆట పూర్తయిపోయింది. ఇంకా మిగిలింది రెండ్రోజులే. టీమిండియా జోరు చూస్తోంటే, భారీ ఇన్నింగ్స్‌ దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. ఇంకా 86 పరుగులు వెనకబడ్డ టీమిండియా, ఇంగ్లాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఎంత ఆధిక్యం కనబరుస్తుంది.? అన్నదానిపై మ్యాచ్‌ ఫలితం ఆధారపడి వుంటుంది.