రైనా కూడా సుడిగాడే..!

బాహుబలి..రాజమౌళి అద్భుత క్రియేషన్..అందులో సందేహం లేదు. బాహుబలి తొలి పార్ట్ కు మీడియా కోరి కోరి విపరీతమైన హైప్ తీసుకువచ్చింది. బాహుబలి షూటింగ్ చుట్టూ ఇనుప గోడ కట్టేసినా, ఏదో ఒకటి, నిజమో, అబద్ధమో,…

బాహుబలి..రాజమౌళి అద్భుత క్రియేషన్..అందులో సందేహం లేదు. బాహుబలి తొలి పార్ట్ కు మీడియా కోరి కోరి విపరీతమైన హైప్ తీసుకువచ్చింది. బాహుబలి షూటింగ్ చుట్టూ ఇనుప గోడ కట్టేసినా, ఏదో ఒకటి, నిజమో, అబద్ధమో, రాసి రాసి దానికి ఓ లెవెల్ హైప్ తెచ్చింది మీడియా. ఆపై తనకు వున్న ఆబ్లిగేషన్లు, ఇతరత్రా కారణాలతో, ఈనాడు దినపత్రిక బాహుబలి శివలింగాన్ని మోసినట్లు, ఈ సినిమాను మోసింది. పుష్కర స్నానం చేయకపోతే పాపం అన్నట్లు, బాహుబలి చూడకపోతే జన్మ సార్థకం కాదన్నంతగా ప్రచారం సాగించారు. 

దీనికి తోడు జకన్న టీమ్ బాలీవుడ్ లో లక్షలు, చైనాలో కోట్లు ప్రచారానికి ఖర్చు చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రెండో పార్ట్ రెడీ అవుతోంది. ఈసారి తెలుగుమీడియా అంతగా తనంతట తాను బాహుబలి వార్తల కోసం వెంపర్లాడడం లేదు. ఎంత సేపూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న పిచ్చి ప్రశ్న తప్పితే మరొక ప్రచారం లేదు. 

కానీ సినిమా రెండో భాగానికి ఇప్పుడు హైప్ అవసరం అయింది. ఇప్పటి వరకు సినిమా రెండో భాగం ఎవరికీ ఇవ్వలేదు. కనీసం మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లకు అమ్మాలని నిర్మాత ఆలోచన. ఎందుకంటే తొలి భాగంలో బాహుబలి వల్ల బయర్లు బాగుపడ్డారు తప్ప, నిర్మాతలకు వచ్చింది సున్నానే. ఎవరు అడిగినా రెండో భాగం మీద హామీనే తప్ప, కన్ఫర్ మేషన్ ఇంతవరకు ఇవ్వలేదు.  

ఇక అమ్మే రోజులు దగ్గరకు వస్తున్నాయి. మంచి రేటురావాలంటే మరింత హైప్ రావాలి. మీడియా చూస్తే, వార్త దొరికితే వేద్దాం లేకుంటే లేదు అన్నట్లుగా వుంది. గతంలోలా బాహుబలి సెట్ లోకి కన్నాల లోంచి తొంగిచూడడం లేదు. అందుకే ఇక బాహుబలి టీమ్ దిగిరాక తప్పలేదు. నిత్యం ఏదో ఒకటి వాళ్లకు వాళ్లే బాహుబలి గురించి వదలడం ప్రారంభించారు. యుద్ధం ప్రారంభమైందన్నారు. పెద్దగా కవరేజ్ లేదు. తు

మ్మితే వార్త, దగ్గితే వార్త ఫస్ట్ పార్ట్ కు అలవాటైంది. అందుకే సెట్ లో వర్షం పడితే మాహిష్మతిలో వర్షం అన్నారు..అయినా పెద్దగా పట్టించుకోలేదు. నాని సెట్ లోకి వెళ్లాడు.. ప్రియమణి సెట్ లోకి వెళ్లింది అంటూ మళ్లీ ఫీలర్లు, ఫొటోలు. మొత్తానికి బాహుబలి ఈసారి తనంతట తానే ప్రచారం కోసం కిందా మీదా అవుతున్నాడు.