భోజనంతో పాటు పండ్లు తింటే ఏమౌతుంది?

ప్రతి రోజూ పండ్లు తినమంటారు. ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఎప్పుడు తినాలి? ఇది మాత్రం చాలామంది చెప్పరు. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు కూడా. మరీ ముఖ్యంగా ఎక్కువమంది ఆహారంతో పాటు…

ప్రతి రోజూ పండ్లు తినమంటారు. ఇది అందరూ చెప్పే మాటే. కానీ ఎప్పుడు తినాలి? ఇది మాత్రం చాలామంది చెప్పరు. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు కూడా. మరీ ముఖ్యంగా ఎక్కువమంది ఆహారంతో పాటు పండ్లు తింటారు. ఇంతకీ ఇలా భోజనంతో పండ్లు తినడం మంచిదేనా? ఇది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగం?

భోజనంతో పాటు ఫ్రూట్స్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదంటున్నారు ముంబయికి చెందిన డైటీషియన్ పూజ. పండ్లలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. భోజనంతో పాటు పండ్లు తినడం వల్ల వీటి సత్ఫలితాల్ని మనం కోల్పోతాం.

ఎలా అంటే.. పండ్లలో ఉండే పోషకాల్ని వెంటనే శరీరం గ్రహిస్తుంది. భోజనంతో పాటు వీటిని తినడం వల్ల ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, క్రొవ్వు లాంటివి పండ్లలోని పోషకాల్ని వెంటనే జీర్ణం కాకుండా అడ్డుకుంటాయి. 

దీని వల్ల పండ్లలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. అవన్నీ మళ్లీ కెలొరీల రూపంలో మారిపోతాయి. భోజనం తర్వాత పండ్లు తిన్నా ఇదే రిపీట్ అవుతుంది. శరీరంలో కెలొరీలు ఎక్కువైతే, అదనంగా వచ్చి చేరిన కెలొరీలు క్రొవ్వులుగా మారిపోతాయి.

ఫ్రూట్స్ తినడానికి సరైన సమయం

రోజూ పండ్లు తినేవాళ్లు దానికోసం ప్రత్యేకంగా ఓ సమయం కేటాయించుకోవాలి. ఇలా విడిగా పండ్లు తినడం వల్ల వాటిలోని పోషకాలు (మినరల్స్, విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు) నేరుగా శరీరానికి అందుతాయి. ఉదయాన్నే మొదటి భోజనంగా ఫ్రూట్స్ తినడం మంచిది. ఇలా చేయడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఆరోజును ఉత్తేజంగా ప్రారంభించడానికి ఇది తోడ్పడుతుంది. పైగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మొత్తంగా చూసుకుంటే, రోజూ పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది. కాకపోతే దానికంటూ ఓ సమయం కేటాయించాలి. రెగ్యులర్ డైట్ లో పండ్లు తినడానికి కూడా ఓ ప్లానింగ్ ఉండాలి. దీనికి సీజనల్ ఫ్రూట్స్ (కాలానుగుణంగా దొరికే పండ్లు) కూడా జోడిస్తే.. ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. 

ఉప్పెనంత వసూళ్లు

రెడ్డి కులస్తులు ఓన్ చేసుకుంటారా?