ఎమ్బీయస్‌ క్రైమ్ రచన : కబుర్లపోగు కథకు ముగింపు

''అందమైన ఆడవాళ్లను చూస్తే గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది?'' అన్నాడు జయేష్‌ గ్లాసులు మళ్లీ ఒకసారి నింపుతూ. Advertisement ''ఇది గుండె కాబట్టి. అది అందమైన ఆడది కాబట్టి.'' అన్నాడు జయేష్‌ పార్టనర్‌ విల్సన్‌…

''అందమైన ఆడవాళ్లను చూస్తే గుండె వేగంగా ఎందుకు కొట్టుకుంటుంది?'' అన్నాడు జయేష్‌ గ్లాసులు మళ్లీ ఒకసారి నింపుతూ.

''ఇది గుండె కాబట్టి. అది అందమైన ఆడది కాబట్టి.'' అన్నాడు జయేష్‌ పార్టనర్‌ విల్సన్‌ చిరునవ్వు నవ్వుతూ.

''బాగా చెప్పారు, సింపుల్‌ ఆన్సర్‌ బట్‌ యూనివర్సల్‌ ట్రూత్‌. మా ఇండియన్స్‌లో దాపరికం ఎక్కువ కాబట్టి ఆడది అర్ధనగ్నంగా కనబడినా గుండె లబ్బో, డబ్బో అని తెగ కొట్టేసుకుంటుంది. అదే మీ అమెరికన్స్‌లో అయితే అలాటి ఫీలింగ్స్‌ తక్కువ అనుకునేవాణ్ని ఒకప్పుడు..'' అంటూ మొదలెట్టాడు జయేష్‌ మిత్రుడు ఆదినారాయణ.

''..ఆ మాట నిజమే! నేను అమెరికాలో తిరిగేటప్పుడు గమనించాగా! అక్కడ గుడ్డలిప్పుకుని తిరిగే అమ్మాయిలను చూస్తే మన ఇండియన్లు ఔట్‌!'' అన్నాడు జయేష్‌.

ఆదినారాయణ గొంతు పెంచాడు. ''నో, నేను ఒప్పుకోను. అది మనిషిని బట్టి ఉంటుందంటాను. ఓ సారి తమాషా సంఘటన జరిగింది. పక్కా ఇండియన్‌నైనా నేనేమీ చలించలేదు కానీ అదే ఫ్లయిట్లో ఉన్న అమెరికన్‌కి ఆ ఎయిర్‌హోస్టెస్‌ని చూసి దెబ్బకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చేసింది.'' అని గట్టిగా నవ్వాడు. కథకు మంచి ఓపెనింగ్‌ ఇవ్వడంలో ఆదినారాయణ ఘటికుడు.

విల్సన్‌ ఉత్సుకతతో ముందుకు వంగాడు, ''ఏకంగా హార్ట్‌ ఎటాకే!?''

''ఆహాఁ, హార్ట్‌ ఎటాకే. ఆ అమెరికన్‌ అచ్చు మీలాగే ఉన్నాడు. ఎత్తు, రంగు, వయసు అన్నీ మీలాగే. జయేష్‌ మిమ్మల్ని పరిచయం చేయగానే ఎక్కడో చూసాన్రా అనుకున్నాను. ఇప్పుడు హఠాత్తుగా గుర్తుకువచ్చాయి, ఆ పేషంటూ, ఆ మోస్టు ఇంట్రస్టింగు ఎపిసోడూ. ఒరేయ్‌, జయేష్‌ ఆ గ్లాసందుకో..'' అంటూ ఆదినారాయణ కథకు ఉపక్రమించాడు.

***************

ఏదైనా రసవత్తరంగా చెప్పడంతో దిట్ట అని ఆదినారాయణకు ఫ్రెండ్స్‌ సర్కిల్లో పేరు. 'కోతలు కోస్తాడు, గురూ' 'వట్టి కబుర్లపోగు' అంటూనే అతన్ని మందు పార్టీలకు పిలుస్తారు మిత్రబృందం. అతను లేకపోతే హుషారే ఉండదు. అతనూ, జయేష్‌ చిన్నప్పుడు క్లాసుమేట్స్‌. తర్వాత జయేష్‌ పెద్ద ఇండస్ట్రియలిస్టు కాగా ఆదినారాయణ చార్టెర్డ్‌ అక్కౌంటెంటుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. తరచు విదేశాలు వెళ్లివస్తుంటాడు. 'మా కంపెనీ కూడా ఆడిట్‌ చేయి. మా పార్ట్‌నర్‌ విల్సన్‌ను పరిచయం చేస్తాను, రా.' అంటూ ఢిల్లీ నుంచి మసూరీ లాక్కొచ్చాడు జయేష్‌.

జన్మతః అమెరికన్‌ అయినా భార్యతో సహా రెండేళ్ల క్రితమే ఇండియా వచ్చేసి ముస్సోరీలో స్థిరపడ్డాడు విల్సన్‌. ఢిల్లీలో వ్యాపారం నడుపుతున్న జయేష్‌ పరిచయమయ్యాక అతని పద్ధతి నచ్చి పెద్ద పెట్టుబడితో భాగస్వామిగా చేరేడు. కొత్త ఆడిటర్ని తీసుకొస్తాననగానే ఇంటికి డిన్నర్‌కి తీసుకురమ్మన్నాడు. అతని భార్య లోపల డిన్నర్‌ ఏర్పాట్లలో మునిగిఉంటే బయట డ్రింకింగ్‌ సెషన్‌ సాగుతోంది.

''…నేను తరచుగా అమెరికాలో డొమెస్టిక్‌ ఫ్లయిట్స్‌లో ప్రయాణం చేస్తూ ఉంటానని నీకు తెలుసుగా. ఓ సారి అలా ఫ్లయిట్‌లో న్యూయార్కు వెళుతూండగా కలిగింది, నా జీవితంతో మొట్టమొదటి హైజాకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌…'' అంటూ ఆదినారాయణ అందుకున్నాడు.. 

''ఆ రోజు విమానం ఖాళీ, ఖాళీగానే ఉంది. నేనో మూల కూచుని పేపరు చూస్తున్నాను. ఎయిర్‌హోస్టెస్‌లు డ్రింక్స్‌ సర్వ్‌ చేస్తున్నారు. కొంతమంది అటూ, ఇటూ తిరుగుతున్నారు. అంతలోనే స్పీకర్లో వినబడింది – ''లేడీస్‌ అండ్‌ జెంటిల్మెన్‌, ప్లీజ్‌ రిటర్న్‌ టు యువర్‌ సీట్స్‌'' అని. ఆ పక్కా, ఈ పక్కా తల తిప్పి చూసేటప్పటికి ఆఖరి సీట్లకు వెనుక ఒకతను రివాల్వర్‌ పట్టుకుని నిలబడి ఉన్నాడు. పొడుగ్గా ఉన్నాడు. ఎవరూ గుర్తు పట్టకుండా పెద్ద రెయిన్‌కోటు వేసుకుని మొహానికి పెద్ద సాక్సు తొడిగేసాడు.

''ఇది హైజాక్‌. మీరు వెళ్లి సీట్లలో కూచోండి. కదలకుండా కూచున్నంతసేపు మీ కే ప్రమాదమూ లేదు'' అన్నాడు. ఇప్పటికి అందరికీ తెలిసివచ్చింది – మెడలు రిక్కించి, తలకాయ తిప్పి మిర్రి మిర్రి చూడసాగారు. అప్పుడే అందరికీ ఆందోళన ప్రారంభమయింది. ఎయిర్‌లైన్సు స్టాఫ్‌ కూడా బెరుకు, బెరుకుగా ఉన్నారు. ఓ ఫ్లయిట్‌ ఇంజనీర్‌ కాక్‌పిట్‌ తలుపు కొద్దిగా తెరిచి, బయటకు తొంగిచూసి వెంటనే తలుపు మూసేసాడు.

''ఇదిగో ఎయిర్‌ హోస్టెసులూ, మీరు ప్రయాణికులకు ఏది కావాలంటే అది ఇవ్వండి. మీ సర్వింగ్‌ ఆపవద్దు.'' అన్నాడు హైజాకరు. ఆ తర్వాత ఇంటర్‌కమ్‌లో పైలట్‌తో ఏదో మాట్లాడేడు. తర్వాత తెలిసిందేమిటంటే మిలియన్‌ డాలర్ల విలువైన డైమండ్స్‌ ఇమ్మనమని హైజాకరు కోరాట్ట. ఇవ్వకపోతే విమానం కాల్చేస్తానన్నాట్ట. వాషింగ్టన్‌లో విమానం బలవంతంగా దింపి, ఆ వజ్రాలు అక్కడ అందజేయాలట. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాట్ట.

వాడడిగినదంతా ఎయిర్‌లైన్స్‌ కంపెనీవాళ్లు ఇచ్చేస్తే బాగుండునని  మేమంతా దేవుణ్ని ప్రార్థించాం. ఏమో తిక్కమనిషి, గుండు పేల్చాడనుకో. మనిషికి తగిలినా, విమానం గోడకు తగిలినా అంతే సంగతులు. దేవుడు నా మొర విన్నాడు. వాషింగ్టన్లో విమానం దిగడం అక్కడికి పోలీసు మందీమార్బలంతో ఎయిర్‌లైన్సు కంపెనీవాళ్లు వచ్చి డైమండ్స్‌ అందించడం జరిగింది. ఆ హైజాకరు వజ్రాల్ని పరీక్షించి చూసుకుని సరేనని తల ఊపాడు. తలుపు మూసేసి పైలట్‌ను న్యూయార్కు వైపు పదమన్నాడు. అది ఓ గంట ప్రయాణం.

వజ్రాలయితే సంపాదించాడు. కానీ అవి తీసుకుని సురక్షితంగా బయటెలా పడగలడా అని మా సందేహం. హైజాకరు మనస్సులో ఏముందో తెలియదు. ఏం జరుగుతుందో అని ఉగ్గబట్టుకుని చూస్తూండగా ''జస్ట్‌ ఎ మినిట్‌'' అన్నాడతను. అందరూ తల తిప్పారు.

''ఇదిగో, ఆ పిటపిటలాడిపోతున్న ఎయిర్‌హోస్టెస్‌ అమ్మాయ్‌, ఇలా రా'' అన్నాడు.

ఆ ఫ్లైట్‌లో ముగ్గురు హోస్టెస్‌లున్నారు. ముగ్గురూ అందంగానే ఉంటారు. నా ఇంట్రస్టు తెలుసుగా. వీళ్లతో పరిచయాలు పెంచుకుందామని చూస్తాను. వాళ్లలో ఇద్దరు చలాకీగా, కలుపుగోరుగానే ఉంటారు. మూడో అమ్మాయి జూడీ అని కొత్తగా ఉద్యోగంలో చేరింది. భలే ఫిగరు. కానీ మగవాళ్లతో అస్సలు కలవదు. స్టాఫ్‌తో కూడా కలిసిమెలసి ఉండదు. వాళ్లంతా కలిసి ఆమెకు 'ఐసుబొమ్మ' అని పేరుపెట్టారు.

నన్నడిగితే ఆ పేరు సరిగ్గా సూటవుతుంది. మనిషి చెక్కిన శిల్పంలా ఉంటుంది. చిరునవ్వు నవ్వడం కూడా అరుదే. కాస్త నాన్‌వెజ్‌ జోక్‌ వేసినా సరే ముడుచుకుపోతుందిట. అసలెప్పటికైనా పెళ్లి చేసుకుంటే మొగుణ్ని దగ్గరకు రానిస్తుందా అనిపిస్తుంది. ఒకసారి చూస్తే చాలు ఊరించే అందాన్నిచ్చిన దేవుడు స్పందించే మనస్సుని ఇవ్వకపోవడం అన్యాయం అనిపిస్తుంది.''

''కథ కానీయరా బాబూ, ముందు నువ్వు ఊరించి చంపుతున్నావు.'' అన్నాడు జయేష్‌ చిప్స్‌ అందుకుంటూ.

''కథానాయకురాలే ఆ జూడీరా బాబూ, ఆ మాత్రం వర్ణన ఉండకపోతే రక్తి కట్టదు. ఆ హైజాకరు గాడు కూడా ఆమెని చూసి ఖంగుతిన్నాడు లాగుంది. తన పిలుపుకి ఎవరు పలకాలో తెలియక తికమక పడుతున్న ముగ్గురు ఎయిర్‌హోస్టెస్‌లను చూస్తూ ''ఇదిగో 38 సి కప్స్‌ అమ్మాయ్‌, నిన్నే.'' అన్నాడు. అంత వక్షోజసంపద ఉన్నది జూడీకే. ఆ వర్ణన వింటూనే అందరూ తన కేసే చూడడంతో జూడీ కొయ్యబారిపోయింది. ఐసు ఇంకా గడ్డకట్టుకుపోతే ఎలా ఉంటుందో తెలిసివచ్చింది నాకు.

''నీది అసలు సరుకేనా? పెట్టుడు సరుకా?'' అన్నాడు హైజాకరు వెక్కిరింతగా. 

జూడీ మాట్లాడలేదు. కొరకొరా చూసింది. 

హైజాకరుకేం భయం? ''ఆ యూనిఫాం విప్పు. అసలెంతో, నకిలీ ఎంతో చూద్దాం.'' అన్నాడు తుపాకీ ఊపుతూ.

ఎంత ఐసుముద్దకైనా భయం ఉంటుందిగా. స్థాణువులా నిలబడే బ్లౌజ్‌ గుండీలు విప్పసాగింది. దగ్గరనుంచి చూస్తే బాగా కనబడుతుందని కాబోలు, హైజాకరు ఆమెకు దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. బ్లౌజ్‌ విప్పి అతని కాళ్ల దగ్గిర పడవేయగానే ప్రయాణీకుల్లో సగం మంది 'హాఁ' అన్నారు మూకుమ్మడిగా. అన్నవాళ్లు మగవాళ్లు మాత్రమే కాదని గుర్తుంచుకో. ఎప్పుడు ఫట్‌ మనాలో తెలీనంత టెన్షన్‌ అనుభవిస్తోంది ఆ బ్రా. ప్రయాణీకుల్లోనూ అంతే టెన్షన్‌. హైజాకర్‌ అడ్డు రావడం వల్ల పూర్తిగా కనబడనివాళ్లలో మరీ టెన్షన్‌. స్కర్ట్‌ జిప్‌ లాగి, అది నేలమీద పడగానే కాళ్లతో ముందుకు నెట్టి ఆమె ఆగిపోయింది. హైజాకరు వెన ఉన్నవాళ్లు తొంగి, తొంగి చూస్తున్నారు.

''తక్కిన బట్టలు కూడా ఇప్పిపారేయి. సిగ్గుపడే అమ్మాయిలంటే నాకు చిరాకు.'' అన్నాడు హైజాకరు.

హైజాక్‌ చేసి అవస్థపెట్టిన అతని మీద ఉన్న కోపం మటుమాయం అయిపోయింది ప్రయాణీకులకు. 'ఏం సలహా ఇచ్చాడురా!' అనుకున్నారు. జూడీ మాత్రం ఏం చేస్తుంది? అంతమంది మగవాళ్లు, ఆడవాళ్లు, సాటి ఉద్యోగస్తులు అందరిముందు దిసమొలగా నిలబడడమంటే.. సిగ్గుతో చచ్చిపోతూ, కొద్ది కొద్దిగా, నెమ్మదిగా దుస్తులు ఊడదీసింది. ఆమె ఆలస్యం చేసినకొద్దీ జనాలకి ఆరాటం పెరిగిపోయింది.

అన్నీ తీసేసి పూర్తిగా నగ్నంగా నుంచునేసరికి, గురూ..చెప్పొద్దు. అలాటి అందాలరాశిని కనీవిని ఎరగం. నేను దేశదేశాలు తిరిగేను. రకరకాల అందగత్తెల్ని అనుభవించేను. కానీ వాళ్లంతా ఈమె ముందు బలాదూర్‌. ఒక మచ్చలేదు, ఒక పొక్కులేదు, అనవసరమైన రోమం ఒక్కటీ లేదు. ఆపాదమస్తకం వెతికి చూసినా వెలితి కనబడదు. ఆ జుట్టు, చనుకట్టు, నడుమూ, ఆ నిగారింపు –  చూస్తే చాలు పిచ్చెక్కిపోయింది. మొగాళ్లందరూ గుటకలు మింగుతూ చూస్తూ ఉండిపోయారని వేరే చెప్పనక్కరలేదు. ఆడవాళ్లు కూడా కన్నార్పకుండా అలా చూస్తూనే ఉండిపోయారు. ప్రశంస, అసూయ రెండూ ఉన్నాయి వాళ్ల కళ్లల్లో. ఆమె కొలీగ్స్‌ కూడా కళ్లప్పగించి నిలబడిపోయారు.

జూడీ అలా నిలబడిందా, హైజాకరు గాడు ఊరుకోలేదు. ''ఇదిగో పిల్లా, అందరికీ డ్రింక్స్‌ సర్వ్‌  చెయ్యి'' అన్నాడు. తస్సదియ్య! గొప్ప రసికుడులే. లేచి వాడి చెరో బుగ్గ మీద ముద్దు పెట్టుకోబుద్ధేసింది నాకు. డ్రింక్స్‌ కార్ట్‌ కాలితో ముందుకు తోసాడు వాడు. ఇక ఆ పైన తమాషా ఉంది చూడు. ఆ ఎదపొంగులతో కాస్త వంగి ఆ డ్రింక్స్‌ కార్ట్‌ తోసుకుంటూ ఒక్కొక్కళ్ల వద్దకూ జూడీ వస్తూ ఉంటే జనాలకి మతులు పోయేయి. డ్రింక్స్‌ చేతిలోకి తీసుకునే దాకా ఆమె రొమ్ములు కేసి, సీటు దాటి వెళుతూంటే కటిప్రాంతం కేసి, దాటి ముందుకు వెళ్లాక పిరుదుల కేసి పెదాలు నాక్కుంటూ చూసిన వాళ్లే కానీ ఆ డ్రింక్స్‌ రుచి చూసినవాడు లేడంటే నమ్ము.

ఇలా సర్వింగు జరుగుతూండగానే ఇంకా పదిమంది దురదృష్టవంతులకు డ్రింక్స్‌ అందేలోపునే విమానం న్యూయార్కులో ఆగింది. ఇప్పుడింక హైజాకరు పని ఉందిరా అనుకుంటూ వాడికేసి దృష్టి మరల్చేను. ఆశ్చర్యం వాడక్కడ లేడు.

విమానం ఆగీ ఆగడంతోనే ఎయిర్‌లైన్స్‌ స్టాఫ్‌, పోలీసులు తుపాకులు చేతబట్టి లోపలికి చొరబడ్డారు. అందరికంటె ముందుగా వచ్చినవాడు ఓ ఏభై యేళ్ల ఇన్‌స్పెక్టరు. లావుగా, పొట్టిగా ఉన్నాడు. లోపలికి వస్తూనే జూడీ కనబడింది. నోరు తెరిచేసేడంతే! మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. జూడీ గొల్లున ఏడవడంతో తేరుకున్నాడు. కర్తవ్యం గుర్తొచ్చినట్టుంది. తను వేసుకున్న ఓవర్‌కోటు తీసి జూడీ భుజాలమీదుగా కప్పాడు. భయంతో, సిగ్గుతో సగం చచ్చి ఉన్న జూడీ ఒంగి నేలమీద పడి ఉన్న బట్టలను తీసుకుంది కానీ అవన్నీ వేసుకోడానికి సిగ్గుపడింది లాగుంది. అదే చిత్రం ! ఎలాగూ విప్పింది కదా మళ్లీ మా ఎదుటే వేసుకుంటే బాగుండేదా, అబ్బే బట్టలన్నీ చుట్టబెట్టుకుని గుండెలకూ, కడుపుకూ హత్తుకుంటూ ఒంగి విమానంలోంచి పరుగుపెట్టింది.

ఆ ఇన్‌స్పెక్టరు ఓవర్‌కోటు ఆమె పిరుదులదాకానే వచ్చింది. జూడీ మంచి పొడుగులే!  అందువల్ల ఆమె నడుస్తూంటే ఫర్వాలేదు కానీ, కాస్త మెట్లు ఎక్కినా, దిగినా ఆమె జఘనం అందరికీ కనువిందు చేయడం జరిగింది. బిలీవ్‌ మీ, ఆమెను వ్యానెక్కించి ఇంటికి పంపడానికి నలభైమంది పోలీసువాళ్లు వెంట నడిచారు! జూడీ వెర్రెక్కించే అందం అలాటిది!

సరే, ఇక్కడ ఏమైందనుకున్నావ్‌? ప్రయాణీకుల్లో ఒకాయనకు గుండెపోటు వచ్చేసింది. మధ్యవయస్కుడనుకో. హైజాకింగ్‌ జరుగుతున్నంతసేపూ బాగానే ఉన్నాడు. అంటే భయం ఉండుంటుందిలే. కానీ జూడీ అందాలు చూసి ప్రెషరు పెంచేసుకున్నాడు కాబోలు దెబ్బకి ఛాతీలో నొప్పి వచ్చేసింది. ఇదిగో విల్సన్‌లా ఉన్నాడన్నానుగా. అతనే! అతను అమెరికనే, అయినా మతి పోగొట్టుకున్నాడు. కానీ నేను ఇండియన్‌నే అయినా..''

''నీకు ఆత్మనిగ్రహం ఉందని ఒప్పుకున్నాంలే గానీ ఇంతకీ ఆ హైజాకరు ఏమయినట్టు?'' అన్నాడు జయేష్‌.

''అదేరా తమాషా. వాడు మాయమయిపోయాడు. పోలీసులు విమానంలో ప్రతీ అంగుళం, ప్రతీ మనిషిలో ప్రతి అంగుళం గాలించి వదిలిపెట్టారు. హైజాకరు డ్రస్సు గానీ, వజ్రాలు కానీ ఏదీ దొరకలేదు. అది ఓ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. ఆ ఎయిర్‌లైన్స్‌ కంపెనీ వాళ్లు ఈ మిస్టరీని ఛేదిస్తే పెద్ద బహుమతి ఇస్తానన్నారు. హైజాకరు ఆచూకీ తెలిపితే ఇంకా పెద్ద బహుమతి.''

''చిత్రంగా ఉందే! అలా ఎలా మాయమయిపోయాడు? ఒకవేళ అతను ప్రయాణికుల్లో ఒకడేమో. విమానంలో ఖాళీ సీట్లున్నాయిగా. పక్కసీటులో ఎవరూ లేకుండా చూసి టాయిలెట్‌ కెళ్లి రెయిన్‌కోటు వేసుకుని మాస్క్‌ తొడిగేసుకుని వచ్చి ఉంటాడు. పోలీసులు వచ్చేలోపులే ఆ వేషం విప్పేసి మామూలు ప్రయాణీకుడిలా దిగిపోయి ఉంటాడు.'' అన్నాడు జయేష్‌ సాలోచనగా.

''అలా అయితే ఆ డ్రస్సు దొరకాలి కదా, ముఖ్యంగా ఆ వజ్రాలో… పోలీసులు ఎంతలా సోదా చేసారో తెలుసా? ఏ సామానూ వదిలిపెట్టలేదు. అది సరేలే, అసలు ట్రాజెడీ విను. అవేళ జూడీ అందాలు చూసాక ఆమె ఉండే ఫ్లయిట్స్‌లోనే ప్రయాణం చేయాలని ఒట్టేసుకున్నాను. కానీ ఈ హైజాకింగ్‌ గొడవ వల్ల సిగ్గుతో చితికిపోయి ఆమె ఉద్యోగం మానేసింది. పోనీ విడిగా కలుద్దామని ఎంతో ప్రయత్నించాను. కానీ ఎక్కడా దొరకలేదు.'' అన్నాడు ఆదినారాయణ నిట్టూరుస్తూ.

జయేష్‌ గ్లాసు రెండు అరచేతుల మధ్యా తిప్పుతూ కాస్సేపు ఆలోచించాడు. ''ఆదినారాయణా, హైజాకరు డ్రస్సు ఎలా మాయమయిందో నేను చెప్పనా? పోలీసులు మీ అందరి దుస్తులూ సోదా చేసారు కానీ, జూడీ బట్టలు వెతకలేదు. ఇన్‌స్పెక్టరు రావడం, ఓవరుకోటు కప్పడం, ఆమె తన బట్టలు చుట్టచుట్టేసి గుండెలకు హత్తుకుని ఒంగి ఆ బట్టలు దాచుకుంటూ వెళ్లిపోయింది. ఆడవాళ్లు సాధారణంగా చేసేది అదేగా? ఆ బట్టల్లోనే హైజాకరు డ్రస్సు ఉండి ఉంటుంది. మీరంతా జూడీ ఒంపుసొంపులు చూసి చొంగ కార్చుకుంటూండగా వాడు డ్రస్సు విప్పేసి డైమండ్స్‌, సాక్స్‌, రెయిన్‌కోటు జేబులో కుక్కేసి జూడీ బట్టల్లో కలిపేసి ఉంటాడు. వెళ్లి కామ్‌గా తన సీట్లో కూచుని ఉంటాడు.''

''అలా అయితే హోటల్‌కి చేరిన తర్వాతైనా జూడీ కంటబడి ఉంటాయిగా ఆ బట్టలు?''

''పడివుంటాయి. అయినా పోలీసులకు చెప్పలేదంటే దాని అర్థం ఆమెకు ఆ దోపిడీలో హస్తం ఉందని. ఆ హైజాకరూ, ఆమె కలిసి ప్లాను చేసి ఉంటారు. మానవస్వభావం బాగా స్టడీ చేసినవాళ్లు కాబట్టే జూడీ అందాలు ఆరబెట్టారు. అందరి కన్ను గప్పి జారుకున్నారు.'' అన్నాడు జయేష్‌.

''అవున్రోయ్‌ నువ్వన్నది కరక్టే. పోలీసులు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో కూడా ముందే ఊహించవచ్చు. అగ్ని ప్రమాదంలో గుడ్డలు సగం కాలి బయటపడ్డ అమ్మాయిల మీద పోలీసులు తమ కోట్లు కప్పుతూంటారు చూడు. అలాగే ప్రమాదంలో బయటపడ్డ చిన్నపిల్లల జుట్టు చెరపడం, తమ టోపీలు వాళ్ల నెత్తిన పెట్టి హుషారు చేయడం – ఇదంతా ఒకళ్లని చూసి మరొకళ్లు కాపీ కొడుతూంటారు.''

''కరక్టు. ఇదంతా ముందుగానే ఊహించి పోలీసుల ఎదుట ఆమె దిసమొలగా కనబడింది. వాళ్ల కాపలాతోనే వజ్రాలు బయటకు చేరవేసి, ఉద్యోగం మానేసి హైజాకర్ని పెళ్లి చేసుకుని ఉంటుంది.''

''చూసారా విల్సన్‌, మా జయేష్‌ ఎనాలిసిస్‌ అద్భుతంగా ఉంది కదూ, ఇలాగే జరిగుంటుంది. మరి ఆ హైజాకరు ఎవరయివుంటారబ్బా?''

''ఇంకెవరు? ఆ గుండెపోటువాడే. గుండెపోటు వచ్చిందనగానే అందరికంటే ముందు అతన్ని చెక్‌చేసి బయటకు పంపివుంటారు. అంతేగా? అదే మరి! విమానంలో అణువణువూ వెతికాక నా బోటివాడికి ఎవరికైనా జూడీ బట్టల గురించి ఆలోచన వచ్చిందనుకో. వెళ్లి ఆమె బట్టలు వెతుకుతారు. అందువల్ల ఇక్కడ తణిఖీ పూర్తయ్యేలోపుగా బయటపడిపోయి ఆమె హోటల్‌ రూమ్‌కి వెళ్లి బట్టలూ, వజ్రాలూ తీసుకుని సాక్ష్యం మాయం చేసేసి ఉంటాడు.'' అన్నాడు జయేష్‌.

ఆదినారాయణ చప్పట్లు కొట్టాడు. ''బ్రహ్మాండంగా ఉంది. ఎయిర్‌లైన్స్‌ వాళ్లకి ఇప్పుడే ఫోన్‌ చేసి  చెబుతా, ఈ మిస్టరీ సాధించామని, బహుమతి వస్తుంది.''

''దాంతోబాటు విల్సన్‌ను కూడా చూపించు. ఈయనే ఆ గుండెపోటు హైజాకరు అని. పోలికలు ఉన్నాయన్నావుగా.'' అన్నాడు జయేష్‌ నవ్వు కలుపుతూ.

''నిజమేనొరేయ్‌, మిస్టర్‌ విల్సన్‌. మీరు వెస్టర్న్‌ సినిమాల్లో చూసే ఉంటారుగా. మీరే హైజాకరు అని వాళ్లకు మిమ్మల్ని అప్పగించేసి బహుమతి తీసేసుకుంటాను. తర్వాత మీరు నిర్దోషినని నిరూపించుకుని బయటకు వచ్చేయండి. బహుమతి ఫిఫ్టీ,  ఫిఫ్టీ. ఒకే?'' అన్నాడు ఆదినారాయణ.

''నాటే బాడ్‌ ఐడియా'' అంటూ లోపలికి వెళ్లాడు విల్సన్‌ లోపల్నుంచి పిలుపు రావడంతో. లోపలికి వెళ్లగానే ''అంతా విన్నావుగా, నీ కా రోజు ఫ్లయిటులో ఇండియన్‌ ఎవరైనా ఉన్నట్టు గుర్తుందా?'' అన్నాడు భార్యతో.

''ఏసియన్‌ ఎవరో ఉన్నట్టున్నారు కానీ ఇతనవునో కాదో ఎవరికి తెలుస్తుంది? వీళ్లందరి ముఖాలు ఒకేలా అనిపిస్తాయి నాకు.'' అందామె. 

''మరిప్పుడేం చేయాలి?''

************

విల్సన్‌ లేచి వెళ్లడంతో హాల్లో సంభాషణ ఇంగ్లీషు నుండి తెలుగులోకి మారింది. ''గురూ, నువ్వు చెప్తూంటేనే అంత ఎక్సైటింగ్‌గా ఉంది. ఆ అమ్మాయి నిజంగా అంత బాగుంటుందా?'' అన్నాడు జయేష్‌ ఉత్సాహంగా.

''…అనే విన్నాను.''

''వినడమా!?''

''నిజం చెప్పమంటావా? ఇదంతా నా కో పాకిస్తానీ  ఫ్రెండు చెప్పాడు. ఇలాగే ఓ మందు పార్టీలో. ఈ మిస్టరీ విప్పండి చూద్దాం అంటూ అన్నీ వివరంగా చెప్పాడు. – అఫ్‌కోర్సు మా కెవరికీ నీ కున్నంత బ్రెయిన్‌ లేదనుకో…''

 దీ

లోపల విల్సన్‌ భార్య జూడీ అడిగింది – ''మీ పార్ట్‌నర్‌కి కూడా మనమీద అనుమానం వచ్చినట్టుందే?'' అని.

''అవును. వాళ్లు తెలుగులో ఏదో మాట్లాడుకుంటున్నారు. మన గురించేనేమో. జయేష్‌ నీ అందం గురించి చెప్తున్నాడేమో. ఆ వచ్చినతను నన్ను ఆల్‌రెడీ గుర్తు పట్టేసాడు. కానీ కాస్త సందిగ్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా చూసాడనుకో. మబ్బు విచ్చిపోయినట్టు మిస్టరీ విడిపోతుంది. ఎయిర్‌లైన్సు వాళ్లకి ఫోన్‌ చేయడం ఖాయం.'' అన్నాడు విల్సన్‌ నుదుటిపై పట్టిన చెమట తుడుచుకుంటూ.

**************

విల్సన్‌ తన భార్యతో హాల్లో ప్రవేశించగానే అతిథులిద్దరూ లేచి నిలబడ్డారు. 

జయేష్‌ పరిచయం చేయబోతూండడంతో ఆదినారాయణ జూడీకి చేయి అందించబోయాడు కానీ అప్పటికే విల్సన్‌ తుపాకీ కాల్చడంతో కుప్పకూలాడు. 

ఆ వెంటనే జయేష్‌ కూడా. 

''ఇప్పుడీ శవాలను ఏ కొండశిఖరం నుండో తోసేయాలి'' అంటున్న విల్సన్‌ మాటలు వాళ్ల చెవుల్లో పడ్డాయో లేదో కానీ 'ఇతను నన్నెందుకు కాల్చాడు?' అన్న ఆశ్చర్యభావం వాళ్ల ముఖాల నుండి తొలగిపోలేదు.

(ట్రూడీ బేకర్‌, రాషెల్‌ జోన్స్‌ అనే ఎయిర్‌హోస్టెస్‌లు రాసిన ''గెట్‌ ఎవే ఫ్రమ్‌ యిట్‌ ఆల్‌'' పుస్తకంలోని ''టెర్రీ, ద స్కై పైరేట్‌'' అనే సంఘటన ఆధారంగా అల్లిన కథ)  – 1999లో ఆంధ్రప్రభ వీక్లీలో ప్రచురితం

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Archvies