బచ్చలమల్లి కూడా తగ్గేదే లే!

ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అంటున్నాడు అల్లరి నరేష్ కూడా. బచ్చలమల్లి అనే మొరటు క్యారెక్టర్ చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ లో…

ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అంటున్నాడు అల్లరి నరేష్ కూడా. బచ్చలమల్లి అనే మొరటు క్యారెక్టర్ చేస్తున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేసారు. ఈ గ్లింప్స్ లో హీరో క్యారెక్టర్ ఎలా వుండబోతోందో జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ చెప్పేసారు.

ఉదయాన్ని మైక్ లో భగవద్గీత వస్తుంటే, ఆ మైక్ ను విసిరి కొట్టడం, మందు గ్లాసులో వేసుకోవడంలో కూడా ఓ తరహా యాటిట్యూడ్ చూపించడం, ఆపై, ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి అనే డైలాగు.. ఇవన్నీ కలిసి హీరో క్యారెక్టర్ ఎలా వుండబోతోందో చెప్పకనే చెప్పారు.

మూడు వంతులు సినిమా అన్నవరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా టాకీ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. సుబ్బు దర్శకత్వంలో రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆచి తూచి, కొత్త తరహా పాత్రలతో సినిమాలు చేస్తున్నాడు అల్లరి నరేష్. సినిమాలు హిట్, యావరేజ్ అనిపించుకున్నా, అతని నటనకు, ఆ పాత్రలకు పేరు వస్తోంది. అందుకే అదే దారిలో వెళ్తూ జనాలకు మెల్లగా తనను కొత్తగా చూడడం అన్నది అలవాటు చేస్తూ వస్తున్నాడు.

బచ్చలమల్లి కూడా అలాగే వుండబోతోంది. మల్లి అనే ట్రాక్టర్ డ్రైవర్ కథ ఇది. సినిమా మొత్తం ఇంటెన్సివ్ గా వుంటుంది. అమృత అయ్యర్ కథానాయిక. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం. ఈ సినిమా థియేటర్ హక్కులు, నాన్ థియేటర్ హక్కుల బిజినెస్ ముందుగానే పూర్తి కావడం విశేషం.