డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద ముచ్చట పడ్డారు నిర్మాత నిరంజన్ రెడ్డి దంపతులు. నార్త్ ఇండియా మినహా వరల్డ్ వైడ్ హక్కులను 54 కోట్లకు థియేటర్ హక్కులు తీసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ కు తెచ్చి పెట్టిన క్రేజ్ ఇది. నాన్ థియేటర్ మార్కెటింగ్ జరిగిపోయింది. థియేటర్ మార్కెట్ ఓకె. నార్త్ ఇండియా రిలీజ్ కూడా ఓకె. ఇక మిగిలింది పబ్లిసిటీ. ఇప్పటికే రెండు పాటలు వదిలారు. మరో పాట కూడా వదిలారు. ఇవన్నీ బాగానే వున్నాయి. కానీ అసలు సమస్య ఒకటి మిగిలే వుంది. అదే లైగర్ సెటిల్ మెంట్లు
నైజాంలో ఎగ్జిబిటర్లకు, ఆంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర వ్యవహారం వుండనే వుంది. లీగల్ గా ఎక్కడా నిర్మాతలకు సమస్య లేదు. కానీ మోరల్ కమిట్ మెంట్ వుండనే వుంటుంది. ఆ మోరల్ కమిట్ మెంట్ కు, లీగల్ కమిట్ మెంట్ కు మధ్యలో లేని పోని వత్తిడి లు వుండనే వుంటాయి. ఎందుకంటే ఇది ఎగ్జిబిటర్ల సమస్య. బయ్యర్ల గజిబిజి వుండనే వుంది. నిర్మాతలు అమ్మినది ఒకరికి, అక్కడి నుంచి చేతులు మారినది వేరే వేరే వాళ్లకి. అందువల్ల ఒక తకరారు కాదు. కానీ ఇవేమీ సినిమా విడుదలకు బ్రేక్ వేయలేవు. ఎందుకంటే లీగల్ కమిట్ మెంట్ లు ఎక్కడా లేవు.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నైజాంలో, వైజాగ్ లో సినిమాను విడుదల చేసిన వారి దగ్గరే థియేటర్లు అన్నీ వున్నాయి. అందువల్ల అక్కడ థియేటర్ల సమస్య తలెత్తకూడదు అంటే ముందుగా వాళ్లతో ఏదో పాయింట్ దగ్గర సెటిల్ మెంట్ చేసుకోవాల్సి వుంది. పూరి.. చార్మి అందుకు సిద్దంగానే వున్నారు. కానీ అనుకున్న మొత్తాల దగ్గరే తేడా. ఎవరికి ఇవ్వాలి అన్నదే పెద్ద చిక్కు ముడి.
అయితే ఇక్కడ ఓ ప్లస్ పాయింట్ వుంది. థియేటర్లలో సినిమాలు లేవు. ఇస్మార్ట్ వేయము అని థియేటర్లు భీష్మించుకుంటే వారికే నష్టం. పైగా ఆగస్టు 15 అంటే మంచి డేట్. నాలుగు రోజులు సెలవులు. ఇలాంటి టైమ్ ను థియేటర్లు వదలుకోవు.
పైగా డబుల్ ఇస్మార్ట్ సోలోగా ఎటువంటి కాంపిటీషన్ లేకుండా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. అలా అయితే ఇక థియేటర్లు పంతానికి పోవడం కష్టం. అందువల్ల సెటిల్ మెంట్ దిశగానే వ్యవహారం నడుస్తుంది. పట్టు విడుపులు వుంటే చాలు.