కేసీఆర్ వాయిస్ తో డబుల్ ఇస్మార్ట్ పాట

మొన్నటికిమొన్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంత వైరల్ అయిందో అంతా చూశాం. నిజానికి ఆ పద ప్రయోగం బూతు అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి, దాని చుట్టూ ఓ పాట అల్లేశారు,…

మొన్నటికిమొన్న ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఎంత వైరల్ అయిందో అంతా చూశాం. నిజానికి ఆ పద ప్రయోగం బూతు అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి, దాని చుట్టూ ఓ పాట అల్లేశారు, హిట్ కొట్టేశారు. ఇప్పుడు అలాంటిదే మరో ప్రయోగం జరిగింది.

ఈసారి కేసీఆర్ వాయిస్ పెట్టేశారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి మరో సింగిల్ వచ్చింది. ‘మార్ ముంత.. ఛోడ్ చింత’ అనే లిరిక్స్ తో సాగే ఈ పాటలో కేసీఆర్ ఫేమస్ డైలాగ్ (ఏం జేద్దామంటావ్ మరి) పెట్టారు. సందర్భానుసారం పెట్టిన ఈ డైలాగ్, పాటకు ఓ కొత్త కిక్కు తెచ్చిపెట్టింది.

డబుల్ ఇస్మార్ట్ లో పార్టీ సాంగ్ ఇది. రామ్, కావ్య థాపర్ పై పిక్చరైజ్ చేసిన ఈ సాంగ్ ను మణిశర్మ కంపోజ్ చేశాడు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట, అక్కడక్కడ హమ్మింగ్ చేసుకునేలా ఉంది.

పార్టీ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాటలో రామ్ ఎనర్జీ, అతడి డాన్స్ హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవెల్లో ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేస్తారు. పూరి, చార్మి దీనికి నిర్మాతలు.