రాజ్ తరుణ్ ఎఫైర్ల చిట్టా ఇదే..?

తెరపై ఎన్నో లవర్ బాయ్ పాత్రలు పోషించాడు రాజ్ తరుణ్. అయితే తెరవెనక కూడా ఇతడు పెద్ద లవర్ బాయ్ అంటోంది లావణ్య. కేవలం లవర్ మాత్రమే కాదు, రాజ్ తరుణ్ ను స్త్రీలోలుడుగా…

తెరపై ఎన్నో లవర్ బాయ్ పాత్రలు పోషించాడు రాజ్ తరుణ్. అయితే తెరవెనక కూడా ఇతడు పెద్ద లవర్ బాయ్ అంటోంది లావణ్య. కేవలం లవర్ మాత్రమే కాదు, రాజ్ తరుణ్ ను స్త్రీలోలుడుగా చెప్పుకొస్తోంది. అతడి ఎఫైర్లను బయటపెడుతూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టింది.

“నాకు తెలిసి, నాకు కన్ఫర్మేషన్ ఉన్న ఎఫైర్లు కొన్ని ఉన్నాయి. రాజ్ తరణ్ ఎఫైర్లు లవర్ సినిమా నుంచి మొదలయ్యాయి. రిద్దితో రాజ్ ఎఫైర్ సాగించాడు. నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పాను, 6 నెలల డేటింగ్ తర్వాత రిద్ది, ఆ ఎపైర్ ఆపేసింది.”

హీరోయిన్ రిద్దితో పాటు షాలినీతో కూడా రాజ్ తరుణ్ కొన్నాళ్లు కాలక్షేపం చేశాడంటోంది లావణ్య. లిస్ట్ లో అరియానా గ్లోరీ పేరును కూడా చేర్చింది.

“ఇద్దరిలోకం ఒకటే అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలినీతో కూడా రాజ్ తరుణ్ ఉన్నాడు. బిగ్ బాస్ అరియానా గ్లోరీతో కేవలం ఒక రోజు మాత్రమే షూట్ చేశాడు. ఆ ఒక్క రోజులోనే కలిసిపోయారు. నాకు అప్పుడు డీజేయింగ్ అంటే ఇష్టం ఉండేది. ఆ కోర్సు చేసేందుకు చెన్నై వెళ్లాను. నేను వెళ్లిన నెల రోజులకే హైదరాబాద్ లో అరియానాతో రాజ్ స్టార్ట్ చేశాడు. రాజారవీంద్ర ఫోన్ చేసి రాజ్ తరుణ్ చేయిదాటిపోతున్నాడని చెప్పిన వెంటనే హైదరాబాద్ వచ్చేశాను.”

ఇలా రాజ్ తరుణ్ ఎఫైర్ల చిట్టా బయటపెట్టింది లావణ్య. ఇవి కేవలం కొన్ని మాత్రమేనని, ఇంకొంతమంది హీరోయిన్ల పేర్లు తనకు గుర్తుకురావడం లేదని చెబుతోంది.

రాజ్ తరుణ్ కు ఎన్ని ఎఫైర్లున్నప్పటికీ, వాటిని తను ప్రాబ్లమ్ గా ఫీల్ అవ్వలేదంటోంది లావణ్య. అతడు తనతో ఉన్నాడనే నమ్మకంతో ఉన్నానని, మాల్వీ మల్హోత్రా సీన్ లోకి వచ్చిన తర్వాత తనకు ఆ నమ్మకం పోయిందని, అందుకే మీడియా ముందుకు వచ్చానని అంటోంది.

మాల్వి కోసం రాజ్ తరుణ్ రోజుకు 70వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని, 11 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న తనకు మాత్రం ఇల్లు గడవడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. రాజ్ తరుణ్ కు చెందిన 15 కుక్కలు ప్రస్తుతం తన వద్దే ఉన్నాయని, వాటి ఆలనాపాలన కోసం కూడా డబ్బులివ్వడం లేదని అంటోంది. ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.