ఎట్టకేలకు హీరో నవీన్ పొలిశెట్టి నోరు విప్పాడు. “మీకో పర్సనల్ విషయం చెబుతా” అంటూ లేఖ విడుదల చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిందని, ప్రస్తుతం కోలుకుంటున్నాననే విషయాన్ని అందులో స్పష్టం చేశాడు.
“దురదృష్టవశాత్తూ నా చేతికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కాలికి కూడా దెబ్బ తగిలింది. ఈ గాయాల వల్ల నేను త్వరగా నా సినిమాల్ని మీ ముందుకు తీసుకురాలేకపోతున్నందుకు సారీ. నేను పూర్తిగా కోలుకొని ఫుల్ ఎనర్జీతో మీ ముందుకు రావడానికి వైద్యుల సహాయంతో వర్క్ చేస్తున్నాను.”
ఇలా తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టాడు నవీన్. గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ గ్యాప్ లో డెవలప్ మెంట్ లో ఉన్న తన అప్ కమింగ్ సినిమాల స్క్రిప్ట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయని చెబుతున్నాడు. పూర్తిగా కోలుకొని ఆ సినిమాల షూటింగ్స్ మొదలుపెడతానని తెలిపాడు.
ఈ నోట్ తో పాటు, చేతికి కట్టుతో దిగిన ఫొటోను కూడా షేర్ చేశాడు పొలిశెట్టి. అతడికి యాక్సిడెంట్ అయిందంటూ ఈ ఏడాది ప్రారంభం నుంచే కథనాలు వచ్చాయి. వాటిని ఇప్పుడు నిర్థారించాడు. అయితే ఇన్ని నెలలైనా అతడింకా కోలుకోలేదంటే, జరిగిన యాక్సిడెంట్ చాలా పెద్దదని అర్థమౌతోంది.