కార్తి సినిమా షూటింగ్ లో ప్రమాదం

ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది సర్దార్-2 సినిమా. అంతలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సర్దార్-2 షూటింగ్ టైమ్ లో ఓ స్టంట్ మేన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే మృతి చెందాడు Advertisement…

ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది సర్దార్-2 సినిమా. అంతలోనే ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సర్దార్-2 షూటింగ్ టైమ్ లో ఓ స్టంట్ మేన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ వెంటనే మృతి చెందాడు

చెన్నై శివార్లలో మొదలైంది సర్దార్-2 సినిమా. మూవీకి సంబంధించి ఇదే తొలి షెడ్యూల్. దీని కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే యాక్షన్ ఎపిసోడ్ తో షూట్ స్టార్ట్ అయింది. ఓ ఫైట్ సీన్ ను ప్రాక్టీస్ చేస్తున్నాడు స్టంట్ మేన్ ఎజ్జుమలై. అంతలోనే ప్రమాదవశాత్తూ 20 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డాడు. వెంటనే అతడ్ని సమీపంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అతడి ఛాతిభాగంలో తీవ్ర గాయమైంది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావమైంది. ఫలితంగా కొద్దిసేపటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

జరిగిన దుర్ఘటనతో సర్దార్-2 షూటింగ్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై హీరో కార్తి తీవ్ర సంతాపం వ్యక్తంచేశాడు.

రెండేళ్ల కిందటొచ్చిన సర్దార్ సినిమా సూపర్ హిట్టయింది. దీనికి సీక్వెల్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. చెప్పినట్టుగానే ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారు. అంతే ఘనంగా సెట్స్ పైకి కూడా వచ్చారు. అంతలోనే సర్దార్-2 సెట్స్ లో ప్రమాదం జరిగి షూటింగ్ ఆగిపోయింది. కార్తి ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.