రెండు మూడు పార్ట్ల్లో సినిమా అన్నది ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ అయింది. బాహుబలితో రెండు భాగాలు ట్రెండ్ అనుకుంటే పుష్ప, ఇండియన్ 2 తో మూడు భాగాలు అనే ట్రెండ్ స్టార్ట్ కాబోతోంది.
నిఖిల్- నభా నటేష్ నటిస్తున్న టాగోర్ మధు సినిమా ‘స్వయంభు’. ఈ సినిమా కూడా మూడు భాగాలు తీసుకోవడానికి సరిపడా కథ వుందట. సినిమాలో హీరోయిన్ నభ నటేష్ నే ఈ విషయం వెల్లడించారు.
నభా నటించిన డార్లింగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడినపుడు స్వయంభు ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా రెండు మూడు భాగాలు వుండొచ్చు. దర్శకుడు ఆ మేరకు హింట్ ఇచ్చారు అని చిన్న లీక్ వదిలారు నభా నటేష్.
నభా కు స్వయంభు సినిమా కథ ముందుగా చెప్పినపుడే దర్శకుడు ఈ సంగతి చెప్పాడట. తన దగ్గర మూడు నాలుగు భాగాలకు సరిపడా కథ వుందని, రెండు భాగాలు అయితే తీయాల్సి వుంటుంది హింట్ ఇచ్చాడట.
కార్తికేయ 2 తరువాత నిఖిల్ చేస్తున్న సినిమా ఇది. ఈ పాన్ ఇండియా పీరియాడిక్ సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారు. భారీ సెట్ లు వేసారు. పెద్ద పెద్ద టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్ గా వర్క్ ఫినిష్ చేస్తున్నారు.