టాలీవుడ్ లో థర్డ్ జనరేషన్ స్టార్ట్ కాబోతోంది. అక్కినేని- ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ వరకు ఫస్ట్ జనరేషన్ వచ్చింది. ఈ మధ్యలో బాలయ్య, నాగ్ లాంటి వారు కూడా వచ్చారు. ప్రభాస్ నుంచి ఎన్టీఆర్- రామ్ చరణ్, బన్నీ మీదుగా మహేష్ బాబు వరకు రెండో జనరేషన్ వచ్చింది.
ఇటీవల కాలంలో వారసత్వ హీరోల హడావుడి తగ్గింది. కొందరు మెగా హీరోలు, అఖిల్ వచ్చినా, వాళ్లతో పాటే ఏ బ్యాకింగ్ లేని హీరోలు కూడా వచ్చారు. అందువల్ల పెద్దగా ప్రత్యేకమైన ప్రభావం కనిపించలేదు.
అందరి హీరోలతో పాటు అప్పటి వారసులే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏడాది రెండేళ్లలో కొత్త వారసులు వచ్చే సూచనలు క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వస్తాడు అని వినిపిస్తున్న మోక్షజ్ఙ – నందమూరి బాలయ్య వారసుడిగా త్వరలో రాబోతున్నారు.
ఇప్పటికిప్పుడు కాకపోయినా మరి కొన్నెేళ్లలో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ తనయుడు గౌతమ్ రాబోతున్నాడు. కొణిదెల ఫ్యామిలీ నుంచి మెగా వారసుడిగా పవన్ తనయుడు అకీరా రావడం పక్కా.
అంటే నందమూరి, ఘట్టమనేని, కొణిదెల ఫ్యామిలీల నుంచి లేటెస్ట్ జనరేషన్ వచ్చేస్తుంది రాబోయే రెండు మూడేళ్లలో. ఒక్క అక్కినేని ఫ్యామిలీ నుంచి మాత్రం అలాంటి అవకాశం కనిపించడం లేదు.
ఇదిలా వుంటే దర్శకుడు త్రివిక్రమ్ ఇద్దరు వారసుల్లో ఒకరు దర్శకుడిగా ట్రయిన్ అవుతున్నారు. మరి ఏడాదిలోనో, రెండేళ్లలోనో మెగా ఫోన్ పట్టుకోవడం పక్కా. ఈ అవకాశం మాత్రం మరే దర్శకుడికి లేదు. లీడ్ దర్శకుల పిల్లలు అంతా చిన్న వారే.