Advertisement

Advertisement


Home > Movies - Interviews

ఆర్ఆర్ఆర్ ఫ్లాపు అయితే రోడ్డుపై డ్యాన్స్ లు

ఆర్ఆర్ఆర్ ఫ్లాపు అయితే రోడ్డుపై డ్యాన్స్ లు

రామ్ గోపాల్ వర్మ....మళ్లీ మరో సినిమాతో జనం ముందుకు వస్తున్నారు. ఈసారి కొత్త తరహా థియేటర్ లోకి. శ్రేయాస్ మీడియా సంస్థ కొత్త కాన్సెప్ట్ తో అందిస్తున్న ఆన్ లైన్ థియేటర్ లోకి ఆర్జీవీ తన 'క్లయిమాక్స్' సినిమాను ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో ఓ సరదా చిట్ చాట్.

ఆర్జీవీ అంటే ఇంక ఇలాంటి సినిమాలేనా? మంచి సినిమా ఎప్పుడు?

అబ్బా...ఎన్నిసార్లు అడుగుతారు అందరూ ఈ క్వశ్చను. సినిమా చూసేవాళ్లంతా రెండు గంటలు థియేటర్ లో గడుపుతారు. నేను అదే సినిమా మీద ఆరు నెలలు పని చేస్తాను. మరి నాకు అంత బుద్ది లేకుండా చేస్తున్నానా ఈ సినిమాలు. ఎన్నో సార్లు చెప్పా, నా హిట్ సినిమాలు అన్నీ ఫ్లూక్ అని. 

జనం మెచ్చకపోవడం, నచ్చకపోవడం అనేది కంటెంట్ బట్టే కదా?

మీకు నచ్చిన కంటెంట్ మరొకరికి నచ్చకపోవచ్చు. నా సినిమాలు నచ్చేవాళ్లు చూస్తారు. నచ్చని వాళ్లు చూడరు. 

సొసైటీ, మోరల్స్ అంటే మళ్లీ మీకు కోపం వస్తుందేమో?

అబ్బా..మళ్లీ...నేను ఎన్నోసార్లుచెప్పా..ఈ సొసైటీనీ, ఈ మనుషుల్నీ నేను పట్టించుకోను అని. 

హీరోల విడియోలు ఓ డ్రామా

అందరూ లాక్ డౌన్ అంటే మీరు సినిమా తీసారేంటీ?

లాక్ డౌన్ అన్నారు,  ఇంట్లో వుండమన్నారు. అంతే కానీ పని చేసుకోవద్దని అనలేదుగా. నా పని సినిమా చేయడం అదే చేసాను. మిగతావాళ్లు గిన్నెలు తోమి, ఇళ్లు తుడిచి, బట్టలు ఉతికి విడియోలు పెట్టారు. ఆఫ్ కోర్స్ అదంతా విడియోల కోసం అనుకోండి. ఆ తరువాత పనివాళ్లు ఎలాగూ వుంటారు. అదంతా ఓ హడావుడి అంతే.

అంటే అందరూ సరదాగా విడియోలు చేస్తే, మీరు సరదాగా సినిమా చేసేసారు అన్నమాట

అంతేగా. నా పని నేను చేసాను.

లాక్ డౌన్ టైమ్ లో ఎడారిలో షూటింగ్ ఎలా? అంతా గ్రీన్ మ్యాట్ మహిమా?

అదంతా చెప్పేస్తే ఎలా? అందరూ తీసేస్తారుగా.

లాక్ డౌన్ టైమ్ లో ఇంత తక్కువలో సినిమా తీసారు. ఈ లెక్కన మన సినిమాల ఖర్చును తగ్గించే మార్గం మీరు కనిపెట్టినట్లేనా?

కచ్చితంగా ట్రాడిషనల్ విధానాలు పట్టుకుని వేలాడితే చెప్పలేను. లేదూ అంటే జస్ట్ పదిశాతం ఖర్చుతో సినిమాలు చేయొచ్చు.

ఆన్ లైన్ థియేటర్ అనేది కిట్టుబాటు అయ్యే వ్యవహారమేనా?

చెప్పలేను. కొన్నాళ్లకు మాత్రం కచ్చితంగా అవుతుంది. అయితే అది ఒక సినిమాతోనా? పది సినిమాలతోనా? అన్నది తెలియదు. బట్ నా తరహా సినిమాలకు సరిపోతుంది అనుకుంటున్నాను.

మీ తరహా అయితే ఈ తరహా బూతు సినిమాలేనా?

నాకు ఇష్టమైన సినిమాలు. హర్రర్, వయిలెన్స్, సెక్స్, పొలిటికల్ ఇలాంటివన్నీ. నాకు దేవుడు, ఫ్యామిలీ, స్పోర్ట్స్ ఈ జోనర్ సినిమాలు నచ్చవు. దానికి ఇది సరిపోదు కూడా.

సెన్సారు లేకపోవడం కూడా మీకు బాగా నచ్చిన విషయం ఏమో?

అవును. సెన్సారు నిబంధనలు రాసినపుడు ఇప్పుడు వున్న ప్లాట్ ఫారమ్ లు అన్నీ లేవు. టీవీ, ఆన్ లైన్ మాధ్యమం ఇలా. మరి వాటికి లేని సెన్సారు థియేటర్ కు మాత్రం ఎందుకు?  అర్థం లేని వ్యవహారం. 

మళ్లీ లక్ష్మీస్ ఎన్టీఆర్

గతంలో మీరు తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ లాంటివి సెన్సారు లేకుండా ఈ ఆన్ లైన్ లోకి విడుదల చేయవచ్చేమో కదా? సెన్సారు ఓకె చేయని కంటెంట్ మీద దగ్గర చాలా వుండి వుంటుంది కదా?

మంచి ఐడియా. కచ్చితంగా చేస్తాను. ముందు 'గ్రేట్ ఆంధ్ర' కు థాంక్స్ కార్డ్ కూడా వేస్తాను.

మళ్లీ మాకు అదో కాంట్రావర్సీనా?

ఎలాగూ ఇండస్ట్రీ జనాలు మీ మీదకు వచ్చినట్లున్నారు కదా

అదంతా ఎందుకు లెండి...

నేనోటి చెప్పనా, ఇండస్ట్రీ అంతా ఏకంకావడం అన్నది ఎప్పటికీ వుండదు. ఎందుకంటే ఇక్కడ ఎవరి పని వారిది, ఎవరి కాంపిటీషన్ వారిది. నిజానికి మీ నెగిటివ్ సమీక్షలను సినిమా వాళ్లే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పక్కవాడి సినిమా పోతే మిగిలిన వాళ్లందరికీ ఇక్కడ భలే ఆనందం. ఒకడంటే ఒకడికి సరిపడదు. ఇదంతా హ్యూమన్ టెండెన్సీ.

ఇండస్ట్రీ మీద మీకు గట్టి అభిప్రాయమే వున్నట్లుంది.

సినిమా ఇండస్ట్రీనే కాదు, అన్ని రంగాలూ ఇంతే...మీకు ఓ విషయం చెప్పనా? రాజమౌళి ఆర్ఆర్ఆర్ రాబోతోంది కదా? ఈ సినిమా ఫ్లాపు అయితే ఇండస్ట్రీ జనాలు మొత్తం రోడ్ల మీదకు వచ్చి, బట్టలు విప్పి, షాంపేన్ తో స్నానం చేస్తూ డ్యాన్స్ చేస్తారు. 

నిజమా?

మరి. ఒక మనిషి సక్సెస్ లో వున్నాడంటే ఈ ఇండస్ట్రీకి అంత జలసీ. రాజమౌళి మీద కూడా అంతే జెలసీ. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయితే చూస్తూ వుండండి. ఈ సినిమా వాళ్లు రొడ్ల మీదకు వచ్చి డ్యాన్స్ లు చేస్తారు. షాంపేన్ తో స్నానం చేస్తారు. 

ఇంతకీ మీ ఆన్ లైన్ థియేటర్ లోకి రాబోయే తరువాత సినిమా

నగ్నం అనే చిన్న సినిమా.

నగ్నం నా? ఏముంటుంది ఇందులో?

టైటిల్ లో వున్నదే. మీకు కావాల్సినంత సెన్సేషన్ న్యూస్ దొరికేంతగా. ఇదే కాదు, షార్ట్ ఫిలింస్, ఇంకా చాలా తీసుకువస్తాను ఈ థియేటర్ లోకి. 

....వి. రాజా

గృహ‌మే లేకుండా ప్ర‌జ‌ల‌తో గృహ ప్ర‌వేశం చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?