Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

100 టికెట్ లు.. ఒక షో

100 టికెట్ లు.. ఒక షో

ఈవారం విడుదలైందీ సినిమా. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఓ నగరంలో మొదటి రోజే మార్నింగ్ షో పడలేదు. కారణం మరేమీ కాదు. ఇద్దరే టికెట్ కొనడంతో షో వేయలేమని చేతలు ఎత్తేసారు థియేటర్ జనాలు.  సినిమా బాగానే వుంది. మీడియానే సరిగ్గా రెస్పాండ్ కాలేదు అనే భావనలో వున్నారు సినిమా మేకర్లు.. వాళ్లు సంబంధిత జనాలు. అలాంటి టైమ్ లో వాళ్లు ఆలోచనలు నీరుగారుస్తూ, ఇలాంటి న్యూస్ వినిపించింది.

దాంతో మర్నాడు ఉదయాన్నే యూనిట్ మనిషిని ఆ థియేటర్ కు పంపించి 100 టికెట్ లు కొనిపించారు. నిజానికి మర్నాడు ఉదయం కూడా షో క్యాన్సిల్ అనే పనిలో వున్నారు థియేటర్ జనాలు. సరిగ్గా అలాంటి టైమ్ లో ఈ వంద టికెట్ ల బేరం వచ్చింది. దాంతో మార్నింగ్ షో పడింది. కానీ గమ్మత్తేమిటంటే ఆ వంద టికెట్ లు, ఏం చేసారు. ఎవరికి ఇచ్చారు అన్నది మాత్రం తెలియదు. ఎందుకంటే థియేటర్ లో షో కి పెద్దగా జనాలు రాలేదు కనుక.

అంటే కేవలం షో క్యాన్సిల్ అనే అపప్రధ తప్పించుకోవడానికి ఓ వంద టికెట్ లు ఖర్చు చేసారన్నమాట. నిజానికి ఇది రాంగ్ సీజన్. సినిమా జనాలకు అది తెలియదు. ఎప్పుడో ఏదో సినిమా ఇదే డేట్ కు విడుదలైందని అనుకుని, తమ సినిమాలు కూడా విడుదల చేసేస్తారు.

కానీ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలు అన్నింటిలో ఇప్పుడు ఫెస్టివల్ షాపింగ్ సీజన్ నడుస్తుంది. షాపింగ్ మీద నుంచి సినిమా మీదకు దృష్టి మళ్లాలి అంటే ఆ మూవీ ఓ రేంజ్ లో వుండాలి. అలా కాకపోతే యూనిట్ నే ఇలా టికెట్ లు కొనుక్కోవాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?