Advertisement

Advertisement


Home > Politics - Andhra

ముస్లిం రిజర్వేషన్ల రద్దు మీద బాబు నోరు విప్పాలి

ముస్లిం రిజర్వేషన్ల రద్దు మీద బాబు నోరు విప్పాలి

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోందని దానికి టీడీపీ కూటమి తరఫున చంద్రబాబు నోరు విప్పి జవాబు చెప్పాలని వైఎస్సార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ రహమాన్ డిమాండ్ చేశారు. ముస్లిం రిజర్వేషన్లు మత పరమైనవి అని అంటున్నారని కానీ అవి.. ముస్లింలలో కొన్ని పేద వర్గాలకు అందిస్తున్న సాయం అని అన్నారు.

బీజేపీతో చెట్టాపట్టాల్ వేసుకున్న చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పగలరా అని నిలదీశారు. గతంలో వాజ్ పేయి హయాంలో ముస్లిం మైనారిటీలు బాగా ఉన్నారని ఇప్పుడు బీజేపీ పెద్దల వైఖరి మారిందని ఆయన విమర్శించారు.

ప్రధాని మోడీ గల్ఫ్ దేశాలకు వెళ్ళినపుడు అక్కడ ముస్లిం పెద్దలతో కలసి మెలసి ఉంటారని భారత్ రాగానే మాత్రం వ్యతిరేక భావజాలంతో ఉంటారని ఆయన మండిపడ్డారు. కామన్ సివిల్ కోడ్ విషయంలో ప్రధాని మోడీ ముందుకు వెళ్ళడం మంచిది కాదని ఆయన అన్నారు.

మతమేదైనా అందరం భారతీయులం అన్న భావన ఉండాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడింది అని ఆయన అన్నారు. అదే విధంగా అభివృద్ధి సూచీలో 11 నుంచి నాలుగవ స్థానానికి చేరుకుందని అన్నారు. సేవా రంగంలో ఎనిమిది నుంచి ఒకటవ స్థానానికి చేరిందని వ్యవసాయ రంగంలో 26 నుంచి ఎనిమిది  స్థానానికి అలాగే పారిశ్రామిక రంగంలో విశేషమైన ప్రగతి రాష్ట్రం సాధించిందని తెలిపారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?