Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సమీపిస్తున్న గడువు.. కొలిక్కిరాని చర్చలు

సమీపిస్తున్న గడువు.. కొలిక్కిరాని చర్చలు

మార్చి 1 నుంచి కేవలం ఏపీ, నైజాంలోనే కాదు, మొత్తం దక్షిణాదిన సినిమా థియేటర్లు బంద్ పెట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు దిగివచ్చే వరకు తగ్గేది లేదని.. తమిళ నిర్మాతల సంఘంతో పాటు తెలుగు ఫిలింఛాంబర్ కూడా ప్రకటించింది.

డీఎస్పీల ధరలు తగ్గించడంతో పాటు మిగతా అంశాలపై పోరాడేందుకు టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలంతా కలిసి  జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యారు. సౌత్ లో ఆధిపత్యం చెలాయిస్తున్న క్యూబ్, యూఎఫ్ఓ, పీఎక్స్ డీ లాంటి సర్వీస్ ప్రొవైడర్లతో ఇప్పటికే ఓ సమావేశం నిర్వహించారు.

అయితే ఈ మీటింగ్ లో ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరోసారి 23వ తేదీ శుక్రవారం నాడు సమావేశమవ్వాలని నిర్ణయించారు. మొదటి మీటింగ్ చెన్నైలోని సౌతిండియా ఫిలింఛాంబర్ లో జరగగా.. రెండో సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించే అవకాశాలున్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. వచ్చే శుక్రవారం సినీవర్గాలు, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త ధరలు తగ్గించేందుకు డీఎస్పీలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేయగా.. ఏ రేంజ్ లో ధరలు తగ్గబోతున్నాయనే విషయంపై 23న స్పష్టత రానుంది.

అయితే అప్పటివరకు బంద్ ప్రకటనను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టంచేసింది. డీఎస్పీల వివాదంతో పాటు సౌత్ సినీ పరిశ్రమల్ని ఇబ్బంది పెడుతున్న డిజిటల్ స్ట్రీమింగ్ విధానంపై ఇదే సమావేశాల్లో చర్చించాల్సి ఉంది.

కానీ ఇటు తెలుగు, అటు తమిళ నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్ వివాదాలపై పెద్దగా స్పందించడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే అమెజాన్ ప్రైమ్ లాంటి డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలపై సినిమా రావడాన్ని పలు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తప్పుపడుతున్న విషయం తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?