Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

20 నుంచి రవి-సురేందర్ ల సినిమా

20 నుంచి రవి-సురేందర్ ల సినిమా

కిక్ తరువాత మాంచి కిక్కిచ్చే సినిమా అవుతుందని భావిస్తున్న దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో రవితేజ కాంబినేషన్ లో మరో హీరో కళ్యాణ్ రామ్ నిర్మించే సినిమా ఈ నెల 20న ప్రారంభం కాబోతోంది. రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ తో మాంచి జోరుగా వున్నారు సురేందర్ రెడ్డి. బలుపు, త్వరలో రాబోతున్న పవర్ సినిమాలతో మాంచి హుషారుగా వున్నాడు రవితేజ. 

ఇలాంటి కాంబినేషన్ లో తొలిసారి తాను హీరో కమ్ నిర్మాతగా కాకుండా, కేవలం నిర్మాతగా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. వక్కతం వంశీ అందిస్తున్న కథకు, మనోజ్ పరమహంస చాయాగ్రహణం సమకూరుస్తున్నారు. ఎప్పటిలాగే థమన్ సంగీత దర్శకుడు. 20న ప్రారంభమై ఏక ధాటిగా షూటింగ్ సాగుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?