Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

2018లోనే 'ఆ కాంబినేషన్'

2018లోనే 'ఆ కాంబినేషన్'

టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ మూవీ ఎప్పుడా అన్నది కాస్త ఆసక్తికరమే. మహేష్ 25వ సినిమాగా ఈ సినిమా వుంటుందని కూడా వార్తలు వినవచ్చాయి. అయితే ఆ కాంబినేషన్ 2018నే వుంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం చేస్తున్న సినిమా ఫినిష్ చేసాక మహేష్ బాబు 24వ సినిమాగా కొరటాల శివ డైరక్షన్ లో చేస్తాడు. ఆ తరువాత  తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో అశ్వనీదత్, దిల్ రాజు కాంబినేషన్ లో చేస్తాడట. తన తొలి సినిమా నిర్మించిన అశ్వనీదత్ కే 25వ సినిమా అవకాశం ఇవ్వడం విశేషం. అంటే రెండు సినిమాలు స్టార్ట్ అయ్యి, పూర్తి కావాల్సి వుంది. 

అదే సమయంలో తివిక్రమ్ శ్రీనివాస్ మొదట పవన్ కళ్యాణ్ తో ఆ తరువాత ఎన్టీఆర్ తో రెండు సినిమాలు 2017లో ఫినిష్ చేస్తారట. అప్పుడు 2018జనవరిలో మహేష్-తివిక్రమ్ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారన్నమాట. ఒకప్పటి ఈక్వేషన్ల ప్రకారం ఈ సినిమా హారికహాసిని సంస్థ నిర్మించే అవకాశం వుండేది. కానీ వాళ్లు మహేష్ నుంచి అడ్వాన్స్ వెనక్కు తీసేసుకున్నారు కనుక, మైత్రీ మూవీస కే ఆ చాన్స్ దక్కుతుంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?