2021లో వరుణ్ పోలీసు ప్రేమకథ

జీవితంలో ఒకసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలని హీరోలు అందరికీ వుంటుంది. అయితే అన్ని పోలీసు కథలు యాక్షన్ మూవీస్ నే కానక్కరలేదు. కామెడీ చేయొచ్చు..రొమాన్సు చేయొచ్చు. అందుకే వరుణ్ తేజ్ కోసం దర్శకుడు సాగరచంద్ర…

జీవితంలో ఒకసారైనా పోలీస్ క్యారెక్టర్ చేయాలని హీరోలు అందరికీ వుంటుంది. అయితే అన్ని పోలీసు కథలు యాక్షన్ మూవీస్ నే కానక్కరలేదు. కామెడీ చేయొచ్చు..రొమాన్సు చేయొచ్చు. అందుకే వరుణ్ తేజ్ కోసం దర్శకుడు సాగరచంద్ర ఓ పోలీస్ లవ్ స్టోరీ తయారుచేసాడట. 

నిజానికి వాల్మీకి కన్నా ముందే ఓ కథను 14రీల్స్ ప్లస్ కోసం వరుణ్ కోసం సాగర్ చంద్ర రెడీ చేసాడు. కానీ అది వద్దు అని చెప్పి వాల్మీకి చేసారు. దాంతో సాగర్ చంద్ర చైతన్య లేదా ఇంకెవరైనా హీరో అంటూ ప్లాన్ చేస్తుండడంతో, వరుణ్ అర్జెంట్ గా కబురు చేసి, మనమే చేద్దాం, ఆ కథ వద్దు కానీ మరో కథ చేయమనడతో, ఈ పోలీస్ ప్రేమకథను రెడీ చేసాడట దర్శకుడు.

ఆ విధంగా సాగర్ చంద్ర వేరే హీరో దగ్గరకు వెళ్లకుండా ఆపినట్లు అయింది. కానీ వరుణ్ తేజ ప్రస్తుతం బాక్సింగ్ సినిమా చేయాలి. ఎఫ్ 3 మొదలు పెట్టి చేయాలి. ఆ తరువాత సంగతి. పైగా అప్పుడు మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నట్లుగా మరెవరు రాకుండా వుండాలి. అలా అన్నీ జరిగితే అప్పుడు 2021 చివరిలో 14రీల్స్ ప్లస్ మీద సాగర్ చంద్ర-వరుణ్ పోలీసు ప్రేమకథ వుంటుంది.