నటుడు సాయి కుమార్ తన నటనకే కాదు, గాత్రానికి కూడా ప్రసిద్ది. ఆయన ఇటీవల ఓ ఛానెల్ లో తన జీవిత విశేషాలను పంచుకున్నారు. గమ్మత్తయిన తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. తరంగిణి సినిమాకు తొలిసారి సుమన్ కు డబ్బింగ్ చెబితే 500 ఇచ్చారని, బాగా చేసావని అందరూ అంటే మలి సినిమాకు రెండు వందలు పెంచానని, దాంతో తనను తప్పించేసారని చెప్పుకొచ్చాడు సాయి కుమార్. కానీ తను పని చేయని సినిమా సరిగ్గా ఆడకపోవడంతో, తరువాత సినిమాకు వాళ్లే వెయ్యి నూట పదహార్లు ఇచ్చారన్నారు.
ఆ సినిమానే పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు. అప్పటి నుంచి ఇక డబ్బింగ్ విషయంలో వెనక్కు తిరిగి చూసుకోలేదని, ఇటీవల రాజశేఖర్ కు డబ్బింగ్ చెబితే పదిలక్షలు ఇచ్చారని సాయి కుమార్ వెల్లడించారు. ఇఫ్పటికి వెయ్యి సినిమాలకు డబ్బింగ్ చెప్పా అన్నారు.
తండ్రికి అవమానం
సాయి కుమార్ తండ్రి పి. జే శర్మ కు ఓ సారి ఓ పెద్ద స్టార్ సినిమా ఫంక్షన్ విషయంలో అవమానం జరిగిందట. విజయోత్సవాలకు విమానంతో తిరుపతి తీసుకెళ్తామని, రమ్మని చెప్పి, ఓ సాదా సీదా బస్ లో పంపించారట. పైగా ఫంక్షన్ అయిపోయాక కూడా మళ్లీ ఆ సాదా సీదా బస్ లోనే ఎక్కించి, ఓ అన్నం పొట్లాం, మందు బాటిల్ చేతిలో పెట్టి, వెళ్లిపోండి అన్నారట. దాంతో పి. జే శర్మ ఆ సీసా నేలకు వేసి కోట్టేసారట. దాంతో సాయికుమార్ అమెరికా వెళ్లినపుడు వెయ్యి డాలర్లు ఖర్చు చేసి మాంచి స్కాచ్ సీసా పట్టుకువచ్చి తండ్రికి ఇచ్చి, సంతృప్తి పడ్డారట. ఈ సంగతి తెలిసి గుమ్మడి, కొడుకు అంటే ఇలా వుండాలి అన్నారట. ఆ స్టార్ హీరో సినిమాను నిర్మించింది కూడా స్టార్ ప్రొడ్యూసర్ అంట.