Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ బాధ్యత మళ్ళీ బన్నీ మీదేనట.!

ఆ బాధ్యత మళ్ళీ బన్నీ మీదేనట.!

సోషల్‌ మీడియాలో మెగా ఫ్యాన్స్‌కీ, పవన్‌ ఫ్యాన్స్‌కీ మధ్య మళ్ళీ రచ్చ షురూ అయ్యింది. అందునా మళ్ళీ అల్లు అర్జున్‌ అభిమానులకీ, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకీ ఇంకో ఫైట్‌ జరుగుతుండడం మరో విశేషం. దీపావళి తెచ్చిన తంటా ఇది. దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చింది. అందులో చిరంజీవి, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, సాయిధరమ్‌తేజ, వరుణ్‌తేజ, నాగబాబు, నిహారిక కన్పిస్తున్నారు. 'మెగా ఫ్యామిలీ' అంటూ ఈ ఫొటో బయటకు రావడంతో పవన్‌ అభిమానులు నొచ్చుకున్నారట. అంతే, పవనిజం పేరుతో ఆ ఫొటోని ఎడిట్‌ చేసి వదిలారు. అందులో అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ ఔట్‌ అయిపోయారు.. వారి స్థానంలోకి పవన్‌కళ్యాణ్‌ వచ్చాడు. అది కూడా పవన్‌ సెల్ఫీ తీస్తున్నట్లుగా వుంది. 

ఇదీ అసలైన మెగా ఫ్యామిలీ.. అంటూ సోషల్‌ మీడియాలో పవన్‌ అభిమానులు రచ్చ చేస్తోంటే, సహజంగా అల్లు అర్జున్‌ అభిమానులు కౌంటర్‌ ఇవ్వాల్సి వస్తోంది. వాళ్ళిద్దర్నీ వుంచేసి కూడా పవన్‌ని యాడ్‌ చేయొచ్చన్నది అల్లు అర్జున్‌ అభిమానుల ఆవేదన. మామూలుగా ఇలాంటి ఫొటో సెషన్లకి పవన్‌కళ్యాణ్‌ దూరంగా వుంటాడు. పైగా, మెగా ఫ్యామిలీ నుంచి పవన్‌ కాస్త దూరంగా వుంటున్నారన్న గుసగుసలకు కొదవే లేదు. ఏమోలే పవన్‌ వెళ్ళలేదేమో.. అనుకోకుండా, పవన్‌ని పిలవలేదన్న ప్రచారం గట్టిగా జరుగుతోందిప్పుడు. 

అయినా, ఫొటోలో ఏముంది.? అని లైట్‌ తీసుకుంటే ఇంత వివాదమే అనవసరం. కానీ, అక్కడే వుంది చిక్కు అంతా. అభిమానులకు సెంటిమెంట్లే తప్ప, లాజిక్కులు తెలియవనీ.. ఆవేశంలో రచ్చ చేయడం తప్ప, ఆలోచించడం చేయరనీ ఈ ఫొటో వివాదంతో మరోమారు నిరూపితమయిపోయింది. 'చెప్పను బ్రదర్‌..' అంటూ అప్పట్లో పవన్‌ విషయంలో వివాదాన్ని రాజేసిన అల్లు అర్జున్‌, ఆ తర్వాత వివరణ ఇస్తూ క్లాస్‌ తీసుకున్నాడు. మళ్ళీ మరోసారి అలాంటి బాధ్యత మెగా ఫ్యామిలీ తరఫున అల్లు అర్జున్‌ భుజాల మీదే పడిందేమో.! లేదంటే ఈలోగా ఈ వివాదం చల్లారేలా కన్పించడంలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?