ఆ సినిమాకు 1994 బ్యాక్ డ్రాప్

సుధీర్ వర్మ-శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఓ సినిమా. ఈ సినిమా ఓ గ్యాంగ్ స్టర్ బయోపిక్ లాంటిదన్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. ఇటు యంగస్టర్ గా, అటు గ్యాంగ్ స్టర్ గా…

సుధీర్ వర్మ-శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది ఓ సినిమా. ఈ సినిమా ఓ గ్యాంగ్ స్టర్ బయోపిక్ లాంటిదన్న సంగతి ఇప్పటికే బయటకు వచ్చింది. ఇటు యంగస్టర్ గా, అటు గ్యాంగ్ స్టర్ గా శర్వా రెండు షేడ్ లు పండించబోతున్నాడు.

సుధీర్ వర్మ సినిమాల్లో సాధారణంగా ఎమోషన్లు ఎక్కువగా వుండవు. ఈ సినిమా అందుకు పూర్తిగా భిన్నంగా, ఇటు యాక్షన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ సీన్లు కూడా బలంగా వుంటాయని తెలుస్తోంది.

అన్నింటికి మించి ఈ సినిమా సగం 1994బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందట. అంటే దాదాపు ఇరవై ఏళ్ల కిందటి అట్మాస్ఫియర్ సినిమాలో చూపించాలన్నమాట. రంగస్థలం, మహానటి సినిమాలు ఈ మధ్యనే కాస్త పీరియాడిక్ లుక్ ను చూపించాయి. ఇప్పుడు శర్వా సినిమా కూడా అలాంటి లుక్ ను చూపించబోతోంది.

పైగా సెల్ ఫోన్ లు వుండవు. ఫ్లాట్ టీవీలు వుండవు. మోస్ట్ లీ ఇప్పుడు కనిపించే మోడల్ బైక్ లు, కార్లు కనిపించవు. వీటన్నింటిని దృష్టిలో వుంచుకుని వైజాగ్ లో, హైదరాబాద్ లో సెట్ లు డిజైన్ చేసారట. ఈ సెట్ ల కోసమే కాస్త భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ కే కోటి రూపాయలు ఖర్చు చేసారని తెలుస్తోంది.