cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ సినిమాకు హీరో ఫ్రీ.. ఫ్రీ

ఆ సినిమాకు హీరో ఫ్రీ.. ఫ్రీ

నిర్మాతలు భలేగా వుంటారు. హీరో టైమ్ బాగుంటే ఒదిగి వుంటారు. టైమ్ బాగోలేకుంటే, దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజతో సినిమా చేస్తున్న కేఎస్ రామారావు ఇదే చేస్తున్నారని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల కథనం.

ఆయన ఓ సినిమాను కరుణాకర్ డైరక్షన్ లో సాయి ధరమ్ తేజతో స్టార్ట్ చేసారు. లాంఛనంగా షూట్ చేసారు కానీ, ఇంకా తేజ సెట్ మీదకు రాలేదు. త్వరలో స్టార్ట్ కాబోతోంది.

ఇలాంటి టైమ్ లో తేజుకు నాలుగోదో, అయిదోదో ఫ్లాప్ వచ్చింది ఇంటిలిజెంట్ రూపంలో. దీంతో తేజ మార్కెట్ దారుణంగా పడిపోయిందన్న సంగతి క్లియర్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి ప్రాజెక్టు కంటిన్యూ చేయాలా? ఆగాలా? అందుకే కేఎస్ రామారావు క్లియర్ గా తేజుకు చెప్పేసారట.

ఈ సినిమాకు ఎటువంటి రెమ్యూనిరేషన్ ఇవ్వలేనని, సినిమా పూర్తయి, విడుదలయిన తరువాత అంతా బాగుంటే అప్పుడేమన్నా ఇవ్వగలను కానీ, ప్రస్తుతానికి అయితే ఏమీ ఇవ్వలేనని చెప్పేసినట్లు తెలుస్తోంది. దానికి సాయి ధరమ్ తేజ అలాగే అనేసినట్లు తెలుస్తోంది.

అదే విధంగా దర్శకుడు కరుణాకర్ కు కూడా చాలా అంటే చాలా నామినల్ అమౌంట్ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాకే ఇలా చేస్తే, ఆ తరువాత చేసే భగవాన్ పుల్లారావుల సినిమా సంగతేమిటో? తేజు టైమ్ బాగా లేదని అందరూ కాస్త అడ్వాన్స్ లతో సరిపెట్టేస్తారేమో?