రుద్రమదేవి సినిమా తీసిన తరువాత మళ్లీ సినిమా తీయడానికి కిందా మీదా అవుతున్నారు దర్శకుడు గుణశేఖర్. భక్త ప్రహ్లాదను మళ్లీ రీమేక్ చేయాలన్న ఆలోచన వుంది. అదే కాదు ఇంకా చాలా ఆలోచనలు వున్నాయి. అన్నీ భారీనే. కానీ తగిన తారాగణం కావాలి. అందుకు తగిన బడ్జెట్ పెట్టే నిర్మాత కావాలి.
రానాతో ఓ సినిమా చేద్దాం పెట్టుబడి పెట్టమని నిర్మాత, రానా తండ్రి సురేష్ ను అడిగినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. డేట్ లు తీసుకుని, సినిమా నిర్మించండి కావాలంటే అని సమాధానం వచ్చినట్లు గుసగుసలు వున్నాయి. దాంతో ఆ ప్రాజెక్టుకు అలా పాస్ బటన్ నొకేసారు.
మరి ఇప్పుడు లేటెస్ట్ గా ఏం ఆలోచన వచ్చిందో, ఏమిటో? అప్రెంటీస్ గా అసిస్టెంట్ డైరక్టర్ లుగా పనిచేసే కుర్రాళ్లు కావాలని ప్రకటించేసారు గుణశేఖర్. పనిలో పనిగా కాస్త ఎక్స్ ప్రీరియన్స్ డ్ జనాలు కూడా కావాలంటున్నారు. పాత డైరక్టర్లకు కొత్త ఆలోచనలు రావాలంటే, కొత్త యంగ్ బ్యాచ్ తో పని చేయాల్సిందే. ఈ విధంగా గుణశేఖర్ కు ఈ కొత్త బ్యాచ్ తో బాగానే ఉపయోగం వుంటుందేమో?