సినిమా హిట్ అయితే తమ క్రెడిట్, లేదంటే డైరక్టర్ దే తప్పు అనే టైపు టాలీవుడ్ హీరోలు. ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతున్న ఓ సినిమా మీద హీరో వ్యవహారం అలాగే వుందట. ఓ పక్కన ఏదో చేసాననిపించేలా సినిమాకు ప్రమోషన్ చేస్తూనే, మరోపక్క సన్నిహితులతో..ఆ సినిమాను ఒప్పుకోవడమే తప్పు అన్నట్లు మాట్లాడుతున్నాడట సదరు హీరో.
అదో సినిమా.. ఏదో చేసేసాం. అయిపోయింది. అని కొందరి దగ్గర, అసలు ఆ సినిమా ఒప్పుకుని తప్పు చేసా అనే టైపులో మరి కొందరి దగ్గర మాట్లాడుతున్నాడట ఆ హీరో. దాంతో విన్నవాళ్లు మరింత చేసి ఇండస్ట్రీలోకి వదుల్తున్నారు. దాంతో బజ్ రావాల్సిన ఆ సినిమా కాస్తా, నీరసంగా ముందుకు వెళ్తోంది.
మామూలుగానే ఆ హీరో తన సినిమాలకు అంతంత మాత్రం ప్రమోషన్లు చేస్తారు. సినిమా విడుదలకు ముందు కన్నా, విడుదలయి సక్సెస్ అయితేనే ఆయన ప్రచారానికి దిగుతారు. విడుదలకు ముందు ఏదో ఇచ్చాం అంటే ఇచ్చాం అన్నట్లుగా మీడియాకు ఇంటర్వూలు ఇస్తారు. ఇప్పుడు మీడియా మీట్ ల మాట అటు వుంచి, ఇలా మాట్లాడడం అంటే ఏమనుకోవాలి?