Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ హీరో.. ఆ డైరక్టర్ తో బోగవల్లి సినిమా?

ఆ హీరో.. ఆ డైరక్టర్ తో బోగవల్లి సినిమా?

తొలిప్రేమ సినిమాతో ఇంతో అంతో లాభం తెచ్చుకున్నారు నిర్మాత బోగవల్లి ప్రసాద్. అంతకు ముందు నాన్నకు ప్రేమతోను మినహాయిస్తే మిగిలినవి పెద్దగా పేరు తేలేదు. డబ్బులు అంతంత మాత్రం. తొలిప్రేమతో మంచి పేరు వచ్చింది. డబ్బులు వచ్చాయి. అయితే మళ్లీ రాంగ్ ట్రాక్ వెళ్తున్నారా? అని సినిమా జనం అనుమానించే ప్రాజెక్టు ఒకటి అదే బ్యానర్ లో వినిపిస్తోంది.

గోపీచంద్ హీరోగా వీరు పోట్ల డైరక్షన్ లో సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది. గోపీచంద్ హీరోగా ఇదే బ్యానర్ పై సాహసం సినిమా చేసి కాస్త భారీగానే నష్టపోయింది. మనమంతా సినిమాతో సాయి కొర్రపాటికి 15కోట్లు నష్టం మిగిల్చిన యేలేటి చంద్రశేఖర్ నే సాహసం సినిమాకూ డైరక్టర్. ఇక వీరూ పోట్ల.

ఈ మధ్యనే కమెడియన్ సునీల్ తో 'వీడు గోల్డ్ ఎహె' అనే చిత్రమైన టైటిల్ లో భయంకరమైన డిజాస్టర్ ఇచ్చాడు. ఎకె యూనిట్ కి మొత్తం గోవిందా అయింది.

పైగా గోపీచంద్ ఇప్పుడు ఫుల్ గా ఫ్లాపుల లైన్లో వున్నాడు. అలాంటి డైరక్టర్, హీరోల కాంబినేషన్ లో సినిమా చేయాలని బోగవల్లి ప్రసాద్ ఆలోచిస్తున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది. అంటే తొలిప్రేమ డబ్బులు తొందరపెడుతున్నాయేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?