ఆ హీరోయిన్‌కీ డబ్బు కష్టాలు

సినీ నటుడు ఉదయ్‌కిరణ్‌ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకున్న విషయం విదితమే. అయితే ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటన్నది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులేమీ ఉదయ్‌కిరణ్‌కి లేవని ఆయన సన్నిహితులు…

సినీ నటుడు ఉదయ్‌కిరణ్‌ ఆర్థిక ఇబ్బందులతో ప్రాణం తీసుకున్న విషయం విదితమే. అయితే ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య వెనుక అసలు కారణమేంటన్నది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలిపోయింది. చెప్పుకోదగ్గ ఆర్థిక ఇబ్బందులేమీ ఉదయ్‌కిరణ్‌కి లేవని ఆయన సన్నిహితులు చెబుతూనే వున్నారు.

అదలా వుంచితే, కన్నడ హీరోయిన్‌ సంజన (బుజ్జిగాడు సహా పలు తెలుగు సినిమాల్లోనూ నటించింది..) కూడా డబ్బు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే డబ్బు లోటుతో కాదు, తెలిసిన వ్యక్తికి అప్పు ఇచ్చి, దాన్ని రాబట్టుకోడానికి నానా కస్టాలూ పడ్తోంది సంజన. అప్పు తీసుకున్న వ్యక్తిని బాకీ తీర్చమని అడుగుతోంటే, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడంటూ సంజన పోలీసులను ఆశ్రయించింది.

ఓ హీరోయిన్‌ ఇలా తాను ఇచ్చిన అప్పు విషయమై తలెత్తిన వివాదంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం కన్నడ సినీ వర్గాల్లో సంచలనమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు, సంజన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తిని విచారించే పనిలో బిజీగా వున్నారు. బాగా తెలిసిన వ్యక్తి కావడంతో నమ్మి అతనికి అప్పు ఇచ్చాననీ, అతనిప్పుడు మోసం చేయడమే కాక, తన ప్రాణం తీయాలనుకుంటున్నాడని సంజన వాపోతోంది.