ఆయన టాలీవుడ్ లో కాస్త గ్లామర్ వున్న నిర్మాత. ఆయనకు, ఆయన బ్యానర్ కు ఆ పాపులారిటీ వుంది. అందరి మాదిరిగానే పెద్ద నోట్ల యవ్వారం ఆయనకు తలనోప్పి తెచ్చిందని వినికిడి. అయితే ఆయన ఏం గాభరా పడలేదట. ఎవరెవరి దగ్గర అత్యవసరంగా హ్యాండ్ లోన్స్ (చేబదుళ్లు) తెచ్చాం, ఎవరెవరి బిల్లులు పెండింగ్ లో వున్నాయి, అన్నీ చూసి చకచకా పేమెంట్లు జరిపించేసారట.
ఎప్పుడైతే హ్యాండ్ లోన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయో, దగ్గర వుండిపోయిన పెద్ద నోట్లు కూడా ఖర్చయిపోయాయట. దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారట. ఇక రోజువారీ ఖర్చుల సంగతి చూసుకుంటే చాలు.రన్నింగ్ లో వున్న రెండు సినిమాల షూటింగ్ చకచకా సాగిపోతుంది. అంటే మొత్తానికి ఆ నిర్మాత దిల్ కాస్తా టెన్షన్ ఫ్రీ అయిందన్నమాట.