పెళ్లిచూపులు సినిమాకు ముందు చాలా సినిమాలకు చిన్న చితక ఫైనాస్స్ చేసి, కొందరు సన్నిహితులకు పెట్టుబడులు పెట్టి దెబ్బలు తిన్నాడు రాజ్ కందుకూరి. కానీ పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ వ్యవహారం వంటపట్టేసింది. ఏం సినిమా తీయాలో, ఏం రేంజ్ సినిమా తీయాలో ట్రిక్ తెలిసివచ్చింది. పెళ్లిచూపులు సినిమాతో ప్రాఫిట్ అందుకున్నా, అది భాగస్వామ్య వెంచర్.
అయితే ఈసారి సోలో వెంచర్ చేసాడు. మెంటల్ మదిలో సినిమాను అన్నీకలిపి 2.60 కోట్ల రేంజ్ లో ఫినిష్ చేసాడు. దీని థియేటర్ హక్కులను సురేష్ మూవీస్, మధుర శ్రీధర్, ఆసియన్ సునీల్ ముగ్గురికి కలిసి 1.80 కి ఎన్ఆర్ఎ చేసాడు. శాటిలైట్, డిజిటల్ కలిపి యుప్ టీవీకి దాదాపు అదే రేటుకు ఇచ్చేసాడు. అంటే టోటల్ గా మూడు అరవై వచ్చింది. మిగిలినవన్నీ కలిసి మరో యాభై అరవై లక్షల వరకు వచ్చాయి. అంటే సింపుల్ గా కోటికి పైగా కిట్టీలో లాభంగా చేరిపోయింది.
మంచి సినిమా అంటూ హడావుడి జరిగింది. బ్యానర్ కు వాల్యూ వచ్చింది. రెండు డిఫరెంట్ సినిమాలు చేసిన బ్యానర్ అని. ఇక మూడో సినిమాకు ఇక ఇబ్బంది పడనక్కరలేదు. రాజ్ కందుకూరి బ్యానర్ పట్టాలు ఎక్కేసింది.
అన్నట్లు ఇప్పుడు కాకున్నా, మరి కొన్నాళ్లకు అయినా తన కొడుకు హీరో సినిమా చేయాలని ఆలోచనలో వున్నాడట రాజ్ కందుకూరి. కుర్రాడు ప్రస్తుతానికి అమెరికాలో చదువుకుంటున్నాడు. ఆ మధ్య నటి జీవిత కుమార్తె, తన కొడుకు హీరోగా సిన్మా ప్లాన్ చేసాడట కానీ, సరైన సబ్జెక్ట్ దొరక్క ఆగిపోయాడని తెలుస్తోంది.