ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సన్నీలియోన్ హీట్ తగ్గలేదు. సన్నీ ఇండియాకు వచ్చి నాలుగైదేళ్లు గడుస్తున్నా… ఆమె ఇప్పటికే సేలబుల్ మెటీరియల్ గానే ఉంది. ఇండియాలోకి రావడం, బాలీవుడ్ సినిమాల్లో నటించడం సన్నీ లియోన్ కు విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయనే చెప్పాలి. పోర్న్ స్టార్ అయినప్పటికీ .. ఆమెను సినిమా స్టార్ లతో సమానంగా ఆదరిస్తున్నారు ఇండియన్ ఆడియన్స్. అక్కడికీ నటన విషయంలో సన్నీ ఏ విధంగానూ ఆకట్టుకోలేదు, ఆమెనటించిన సినిమాలేవీ అంతగా ఆడలేదు.. అయినా కూడా ఆమెకు మంచి ప్రాధాన్యతే దక్కుతోంది.
మరి ఇదే వేడిలో మరో పోర్నోస్టార్ ను తెరపైకి తీసుకురానున్నాడట వర్మ. ఆమె పేరు టోరీ బ్లాక్. ఈ అమెరికన్ లేడీ వర్మకు బాగా ఇష్టమైన పోర్నో స్టార్ అట, తను బ్లూ ఫిలింలు చూస్తానని బాహాటంగా ప్రకటించుకే వర్మ టోరీని తనకు ఇష్టమైన పోర్నోస్టార్ గా చెబుతాడు. వర్మ ఆటోబయోగ్రఫీలో కూడా ఆ బ్లూఫిలిం నటీమణి ప్రస్తావన ఉంటుంది. ఇప్పుడు ఆమెను ఇండియన్ సినిమాల్లో నటింపజేసే ప్రయ్నాల్లో ఉన్నాడట వర్మ. అన్ని కుదిరితే ఆమె కోసమే ఒక హాట్ సినిమాను తీయడానికి కూడా వర్మ కంపెనీ నుంచి సమాచారం అందుతోంది. మరి మహేశ్ భట్ కంపెనీ పరిచయం చేసిన సన్నీ ఇండియాలోకి వచ్చి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.. వర్మ కంపెనీ పోర్నోస్టార్ ఏ మేరకు సత్తా చాటుతుందో చూడాలి!