Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ 50 కోట్లు చేస్తుందా?

అ..ఆ 50 కోట్లు చేస్తుందా?

యాభై కోట్ల క్లబ్ అన్నది పెద్ద హీరోలకు ఓ ప్రెస్టీజ్ పాయింట్. కానీ మీడియం సినిమాలకు ఆ ఫీట్ కాస్త కష్టం. అయితే అ..ఆ సినిమా సంగతి వేరు. పేరుకే చిన్న సినిమా. పెట్టిన పెట్టుబడి 42 కోట్లు. డైరక్ట్ చేసింది టాప్ త్రీ జాబితాలో వుండే త్రివిక్రమ్ శ్రీనివాస్. పైగా నితిన్..సమంత..లాంటి స్టార్ కాస్ట్. ఇప్పుడు ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్లు సాధించేలాగే వుంది అని ట్రేడ్ అనలిస్టులు లెక్కలు కడుతున్నారు. 

ఒక్క ఓవర్ సీన్ లోనే రెండున్నర మిలియన్లు కలెక్ట్ చేస్తుందంటున్నారు. అంటే అక్కడికే పది కోట్లు వచ్చేలా వుంది. ఇక ఫస్ట్ వీకెండ్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాగానే వసూళ్లు సాగించింది. ఆ మొత్తం 16 వరకు వుంటుందని అంచనా. అంటే మండే బిజినెస్ క్లోజ్ అయ్యే సరికి 30 కోట్ల వసూళ్లు పూర్తయిపోతాయి. వచ్చేవారం నాని జంటల్ మన్, ఆపై వారం చిన్న సినిమాలైన ఒక్క మనసు, కుందనపు బొమ్మ వున్నాయి. 

సందీప్ కిషన్ ఒక్క అమ్మాయితప్ప ఈ నెల 10న కానీ 17న కానీ వచ్చే అవకాశం వుంది. మొత్తం మీద ఇప్పట్లో అ..ఆ సినిమాకు పెద్దగా పోటీ ఎదురయే అవకాశాలు కనిపించడం లేదు. పైగా సినిమాలు లేక థియేటర్లు అన్నీ ఏవో అర కొర సినిమాలు ఆడిస్తున్నాయి. సో..బెస్ట్ చాయిస్ గా ఇదే కనిపిస్తోంది. అందువల్ల మరో ఇరవై కోట్లు వసూలు పెద్ద కష్టం కాదనే అనుకోవాలి.  నిజానికి సినిమా విడుదలకు ముందు నిర్మాత, సినిమాకు సంబంధించిన వారు చాలా టెన్షన్ పడ్డారు. జనానికి నచ్చుతుందా..నచ్చదా అని..ఇప్పడు వాళ్లకు ఇది పెద్ద రిలీఫ్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?