Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ అలా పుట్టిందా?

అ..ఆ అలా పుట్టిందా?

ఒక్కోసారి నమ్మాలని పించేలా చిత్రమైన సంగతులు వినిపిస్తుంటాయి. దర్శకుడు తివిక్రమ్..అ..ఆ సినిమా ప్రకటించిన దగ్గర నుంచి టైటిల్ భలేగా ఆకట్టుకుంటోంది. అనసూయ రామలింగం..ఆనంద్ విహారి..పక్కపక్కన అక్షరాలు...కలుసుకోవడానికి మాత్రం చాలా టైమ్ పట్టిందంటూ డైలాగులు..ఇలా చాలా. 

అయితే ఈ అ..ఆ టైటిల్ ముందు పుట్టి, ఆపై అనసూయ..ఆనంద్ జోడై..కథ దొరికాక, దానికి తగిలించారా? విషయం ఏమిటంటే.. త్రివిక్రమ్ కు క్లోజ్ ఫ్రెండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన సినిమా స్టయిల్ ఊతపదం వుంది.. అ..ఆ..అంటూ బాడీని చిన్నగా షేక్ చేస్తూ. అదే ఇప్పుడు అ..ఆ అలియాస్ అనసూయ..ఆనంద్ గా మారిందనే చమక్కులు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. 

తివిక్రమ్ లాంటి క్రియేటర్ ఎందులోంచి ఏమైనా పుట్టించగలరు..పైగా ఈ సినిమాలో హీరో నితిన్ కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమానే..

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?