Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అ..ఆ దిద్దేశారు

అ..ఆ దిద్దేశారు

అ..ఆ సినిమా విడుదలకు అంతా సిద్దమైంది. అనుకున్నట్లుగానే అర్బన్ ఏరియాల్లో భలే బజ్ వచ్చింది. తొలి రోజు షోలు అన్నీ అడ్వాన్స్ బుక్ అయిపోయాయి. అయితే సెన్సారు తరువాతి నుంచి అ..ఆ సెకండాఫ్ మీద కాస్త డిఫరెంట్ టాక్ వినిపించింది.

కానీ నిన్నటికి నిన్న సినిమా మొత్తం చూసి, ఎక్కడైనా లాగ్ వున్నా, జనం ఏమైనా ఇబ్బంది ఫీల్ అవుతారన్న అనుమానం వున్నా, అన్నీ పెర్ ఫెక్ట్ గా సెట్ చేసేసినట్లు వినికిడి.

దాంతో ఇప్పుడు అ..ఆ టోటల్ గా పెర్ ఫెక్ట్ గా వచ్చిందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. చాలా సినిమాలు విడుదలయిన తరువాత కత్తెర పట్టుకుని కిందా మీదా అవుతారు. అలాంటిది అ..ఆ ముందే అన్నీ చూసుకోవడం అన్నది మంచి సంగతే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?