ఆడేసుకుంటున్న ‘వకీల్ సాబ్’

కోర్టులు, కేసులు అంటేనే వాయిదాలు. వకీల్ సాబ్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఆ సినిమా కూడా అలాగే వాయిదాలతో ముందుకు సాగుతోంది. కరోనా ముందు ప్రారంభమైంది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ మొదలైంది. కానీ…

కోర్టులు, కేసులు అంటేనే వాయిదాలు. వకీల్ సాబ్ అని టైటిల్ పెట్టుకున్నందుకు ఆ సినిమా కూడా అలాగే వాయిదాలతో ముందుకు సాగుతోంది. కరోనా ముందు ప్రారంభమైంది. కరోనా తగ్గుముఖం పట్టాక మళ్లీ మొదలైంది. కానీ ఇప్పట్లోపూర్తి అయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. 

నిజానికి సంక్రాంతికి ఈ సినిమా వుంటుందని రెండు మూడు నెలల కిందటే వినిపించింది. కానీ మళ్లీ ఏప్రియల్ కు వెళ్లింది. థియేటర్లు పూర్తిగా తెరుచుకొవాలి. హండ్రడ్ పర్సంట్ ఆక్యుపెన్సీ రావాలి, అందుకే వాయిదా వేసారు అనుకున్నారంతా. కానీ అది కాదట విషయం.

వకీల్ సాబ్ ఇంకా చాలా పూర్తి కావాల్సి వుందని తెలుస్తోంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను కాస్త మార్చి ఇంప్రూవ్ చేసారు. ఆ ఎపిసోడ్ మొత్తం పూర్తి కావాల్సివుంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే సాంగ్ ను పోలాచ్చిలో షూట్ చేయాల్సి వుంది.

సినిమాను చకచకా పూర్తి చేసే విషయంలో పవన్ తో సమస్యగా వుందని, కానీ నిర్మాత దిల్ రాజు పైకిచెప్పలేక, లోపల ఉంచుకోలేక సతమతమవుతున్నారని తెలుస్తొంది.

పవన్ వైఖరిచాలా చిత్రంగా వుంటుందని, చేయను అనరని, చేస్తాను అని అంటూనే, లాస్ట్ మినిట్ లో వాయిదా చెబుతుంటారని తెలుస్తోంది. ఈ వైఖరి వల్లే వకీల్ సాబ్ ఎంతకీపూర్తి కావడం లేదని తెలుస్తోంది. అజ్ఞాత వాసి టైమ్ లో కూడా ఇదే విదంగా పవన్ ప్రవర్తించారని అప్పట్లో వార్తలువచ్చాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి.

మరోపక్క క్రిష్ సినిమా అలా ఆగిపోయింది. అయ్యప్పన్ కు కొబ్బరికాయ కొట్టారు. దాని పరిస్థితి ఎలావుంటుందోమరి చూడాలి. మొత్తం మీద సినిమాలు ప్రారంభించడంలో వున్న ఆసక్తి పవన్ కు వాటిని పూర్తి చేయడంలో వుండదని, అది అంతా ఆయన మూడ్ మీద ఆధారపడి వుంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

సోహైల్ చాలా తెలివైనోడు